డేటింగ్ లో సందీప్ కిషన్ - రెజీనా కసాండ్రా.. వైరల్ గా మారిన సెల్ఫీ పిక్.. అసలు విషయం ఏంటీ?
టాలీవుడ్ లో మరో జంట ప్రేమలో మునిగితేలుతోంది. హీరోయిన్ రెజీనాతో తెలుగు హీరో సందీప్ కిషన్ పంచుకున్న ఫొటో నెట్టింట వైరల్ గా మారడంతో పాటు.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. మొదల్లో జోరుగా సాగిన సందీప్ కేరీర్ ప్రస్తుతం నిదానంగా కొనసాగుతోంది. దీంతో చక్కదిద్దుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా (Regina Cassandra) కూడా వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. ఇటీవల సినిమాల పట్ల కాస్తా దూకుడుగానే వ్యవహరిస్తోంది.
‘ప్రస్థానం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సందీప్ కిషన్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘బీరువా’ వంటి ఆయా హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అటు రెజీనా సందీప్ కంటే ముందే కేరీర్ ను ప్రారంభించి తెలుగు, తమిళం చిత్రాలలో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. వీరిద్దరూ కలిసి ‘రారా క్రిష్ణయ్య’, ‘నక్షత్రం’ చిత్రాల్లో కలిసి నటించారు.
ఇదిలా ఉంటే.. సందీప్ కిషన్ - రెజీనా డేటింగ్ లో ఉన్నారంటూ నెట్టింట రూమర్ క్రియేట్ అయ్యింది. గతంలోనే వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
రీసెంట్ గా రెజీనా కసాండ్రా పుట్టిన రోజు వేడుకులను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ రెజీనాకు చాలా దగ్గరి వ్యక్తిలాగా విష్ చేస్తూ ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్ యూ. అన్ని విషయాల్లో ఎప్పుడూ నీకు మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
దీంతో పాటుగా రెజీనాతో సందీప్ క్లోజ్ గా ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఫొటోలో రెజీనా కూడా సందీప్ తో చనువుగా కనిపించింది. ఈక్రమంలో వీరిద్దరూ డేటింగ్ నిజమే అంటూ నెట్టింట రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. పొగలేనిదే మంట రాదనే తీరుగా వీరి ప్రేమ వ్యవహారంపై ప్రచారం జరుగుతోంది. దీనిపై సందీప్, రెజీనా ఎలా స్పందిస్తారో చూడాలి.