- Home
- Entertainment
- రాజీవ్ కనకాలతో విడాకులపై తొలిసారి స్పందించిన సుమ, పిల్లల కోసమే అంటూ... షాకింగ్ కామెంట్స్
రాజీవ్ కనకాలతో విడాకులపై తొలిసారి స్పందించిన సుమ, పిల్లల కోసమే అంటూ... షాకింగ్ కామెంట్స్
ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ సరదగా కనిపించే యాంకర్ సుమ (Anchor Suma) షాకింగ్ కామెంట్లు చేసింది. గొడవల కారణంగా తన భర్తతో విడిపోవడం గురించి తొలిసారిగా స్పందించారు. పిల్లల భవిష్యత్ కోసమైనా ఆలోచించాలంటూ షాక్ కు గురిచేస్తోంది.

తెలుగు సీనియర్ యాంకర్ గా సుమ కనకాల (Suma Kanakala) చెరగని ముద్ర వేసుకుంది. తన వాక్ చాతుర్యంతో టెలివిజన్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో సుమ స్టైలే వేరు. తన యాంకరింగ్ స్కిల్స్ తో చాలా షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది. నేటికీ తనకు ఎవరూ పోటీ రాలేరని నిరూపించుకుంటోంది. కొత్త కొత్త షోలతో దూసుకుపోతోంది.
యాంకర్ సుమ స్వరాష్ట్రం కేరళ. 1974 మార్చి 22న పీఎన్ఎల్ ప్రణవీ, పీ విమల దంపతులకు జన్మించింది. కేరళలకు చెందినప్పటికీ వీరు చాలా ఏండ్ల కింద హైదరాబాద్ లోనే నివసించే వారు. దీంతో తెలుగు రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది.
సుమ మదర్ టంగ్ మలయాళం. అయినప్పటకీ తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. ఆ ఫ్లూయేన్స్ తోనే 15 ఏండ్లలోనే తెలుగు సినిమాల ఆడియో లాంచ్ ఈవెంట్లకు ప్రజెంటర్ గా వ్యవహరించింది.
ఇదిలా ఉంటే, సుమ రాజీవ్ కనకాలను 1999లో ప్రేమించి పెండ్లి చేసుకుంది. ఇప్పటికీ వీరిద్దరికి వివాహమైన 23 ఏండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య చెడినట్టు ఎలాంటి వార్తలు బయటికి రాలేదు. కానీ తొలిసారిగా సుమ షాకింగా కామెంట్లు చేసింది. కమెడియన్ అలీ (Ali) వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ‘ఆలీతో సరదాగా..’లో నమ్మశక్యం కానీ నిజాలను వెల్లడించింది.
లేటెస్ట్ గా Alitho Saradaga టాక్ షోకు సంబంధించిన 276వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా అలీ సుమతో మాట్లాడుతూ.. ‘రాజీవ్.. మీరు ఏడాది కింద వేరువేరుగా ఉన్నారంట నిజమేనా?’ అంటూ ప్రశ్నించాడు. ఇందుకు సుమ స్పందిస్తూ ఆశ్చర్యకరంగా బదులిచ్చింది.
సుమ మాట్లాడుతూ.. ‘రాజీవ్ కు నాకు మధ్య ఘర్షణలున్న మాట వాస్తవమే. 23 ఏండ్లుగా ఎన్నోసార్లు గొడవ పడ్డాం. అయితే భార్య భర్తలుగా విడిపోయే సులభమే.. కానీ పిల్లలు పుట్టాక సాధ్యం కాని పని’ అంటూ అలీ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది. ప్రోమోలో సుమ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం క్యాష్ (Cash) గేమ్ షోకు వ్యాఖ్యాతగా ఉన్నారు.