సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, వర్షిణి, వంటలక్క, మంజుల టీవీ సెలబ్రిటీస్ షాకింగ్ రెమ్యూనరేషన్
First Published Jan 22, 2021, 9:34 PM IST
వెండితెరకు దీటుగా బుల్లితెర ఎదుగుతుంది. లాక్‌డౌన్‌లో టీవీ పరిశ్రమకు మరింత ఆదరణ పెరిగింది. దీంతో టీవీలో సందడి చేసే యాంకర్స్, నటులకు ప్రయారిటీ పెరిగింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, వర్షిణి, ఝాన్సీ, శ్యామల, మంజుష ఇలా యాంకర్స్, సుహాసిని, మంజుల వంటి నటీమణులు భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. వారి రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

యాంకర్స్ లో సుమ, అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి టాప్‌లో ఉన్నారు. వీరి తర్వాతే ఎవరైనా. వీరి ఒక్కో షోకి, ఎపిసోడ్‌కి లక్షల్లో తీసుకుంటున్నారట. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న యాంకర్స్ గా నిలుస్తున్నారు.

టీవీ పరిశ్రమలో, సినిమాల్లో యాంకర్‌గా టాప్ లో ఉన్నారు సుమ కనకాల. ఆమె ఒక్కో షోకి మూడు లక్షలు తీసుకుంటున్నారు. తమ పర్సనల్ ఖర్చులు అదనం. అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్‌గా నిలిచారు. టీవీ షోస్ కి సపరేట్ రేట్. వాటిని షో మొత్తానికి మాట్లాడుకుంటుంది.

సెక్సీ యాంకర్ అనసూయ రేట్లు చాలా భిన్నం. టీవీ షోస్ ఎపిసోడ్‌కి రెండు లక్షలు తీసుకుంటుందట. సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో నటించాలంటే దాదాపు కోటి వరకు డిమాండ్ చేస్తుందని లేటెస్ట్ గాసిప్.

హాట్ యాంకర్, జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్ ఒక్కో ఎపిసోడ్‌కి లక్షకుపైగా తీసుకుంటుందని తెలుస్తుంది.

బొద్దుగుమ్మ, యాంకర్ శ్రీముఖి ఒక్కో షోకి లక్ష రూపాయల వరకు పారితోషికంగా అందుకుంటుందని సమాచారం.

`ఢీ` షోతో పాపులర్ అయిన వర్షిణి సౌందరాజన్ షో వారానికి యాభై వేల నుంచి లక్షల వరకు తీసుకుంటుందట.

యాంకర్ ఝాన్సీ ఇటీవల సైలెంట్ అయ్యారు. అడపాదడపా చేసినా ఒక్కో షోకి లక్ష రూపాయల వరకు తీసుకుంటుందట.

సినిమా ఈవెంట్లకు యాంకర్‌గా చేసే శ్యామల ఒక్కో ఈవెంట్‌కి యాభై వేలు తీసుకుంటుందట.

హాట్ యాంకర్ శ్యామల ఒక్కో షోకి, ఫంక్షన్‌కి యాభై వేల వరకు డిమాండ్ చేస్తుందట.

యాంకర్ ప్రశాంతి ఒక్కో షోకి రూ15వేల నుంచి ఇరవై వేల వరకు తీసుకుంటుందని టాక్.

కార్తిక దీపం సీరియల్ పాపులర్ నటి వంటలక్క ఒక్కో ఎపిసోడ్‌కి రూ.ముప్పై వేలు తీసుకుంటుందని టాక్.

`ఆమెకథ` టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన నటి నవ్యసామి ఒక్కో ఎపిసోడ్‌కి రూ.యాభై వేలు తీసుకుంటుందట.

`అగ్నిసాక్షి` సీరియల్ ఫేమ్ ఐశ్వర్య ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 25వేల పారితోషికం తీసుకుంటుందట.

పాపులర్ టీవీ సీరియల్ నటి ఒక్కో ఎపిసోడ్ రూ. పదివేలు అందుకుంటుందట. ఆమె చాలా కంఫర్ట్ అని అంటుంటారు.

టీవీ నటి ఆషికా ఒక్కో షోకి రూ. 12వేలు తీసుకుంటుందట.

టీవీ నటి హరిత ఒక్కో షోకి రూ.12 వేల నుంచి పదిహేను వేల వరకు తీసుకుంటుందని సమాచారం.

పాపులర్ నటి మంజుల ఒక్కో షోకి ఎనిమిది వేల నుంచి పది వేల వరకు అందుకుంటుందట.

పాపులర్ టీవీ నటి ప్రీతి నిగమ్ ఒక్కో షోకి పది వేల నుంచి పదిహేను వేల వరకు అందుకుంటుందట.

టీవీ నటి పల్లవి రామిశెట్టి రూ.15వేలు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం.
