ఇదేందయ్యా ఇది.. అల్లు అర్జున్ సుకుమార్ లాగా మారిపోయాడు.. సుక్కు భార్య దిమ్మతిరిగేలా చేసిందిగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ లాగా మారిపోయాడు. సుకుమార్ సతీమణి తబితా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ముస్తాబవుతోంది. ఆగష్టు 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగాన్ని మించేలా ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచేలా సుకుమార్ పుష్ప 2ని చెక్కుతున్నారు.
పుష్ప చిత్రంలో బన్నీ లుక్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బన్నీ లుక్ విషయంలో పుష్ప 2లో చాలా సర్ప్రైజ్ లు ఉన్నట్లు ఉన్నాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, లుక్స్ లో బన్నీ చిటికెన వేలు అమ్మాయిలని తలపించేలా ఉంది. అలాగే గంగమ్మ జాతర సన్నివేశంలో బన్నీ పోతరాజు తరహాలో కనిపిస్తున్నాడు. ఇలా అల్లు అర్జున్ లుక్ లోనే ఇన్ని వేరియేషన్స్ ఉంటే ఇక కథ ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు.
తాజాగా సుకుమార్ భార్య తబితా ఉహిచని షాక్ ఇచ్చారు. పుష్ప 2 సెట్స్ లో అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇందులో షాకింగ్ గా ఏముంది అని అనుకోవచ్చు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ కనిపిస్తున్న విధానమే షాకింగ్ అని చెప్పాలి.
సడెన్ గా తబిత పక్కన బన్నీని చూస్తే సుకుమార్ ని చూసినట్లే ఉంది. బన్నీ లుక్ కంప్లీట్ గా సుక్కుని పోలినట్లుగా ఉంది. ఆ హెయిర్ స్టైల్, గడ్డం , కళ్ళజోడు అంతా సుకుమార్ ని తలపిస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదేందయ్యా ఇది.. బన్నీని ఇలా మార్చేస్తున్నావు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఎంత నువ్వు డైరెక్టర్ అయితే మాత్రం హీరో గెటప్ నీలాగా ఉండేలా మార్చేస్తావా అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.మరో అభిమాని సుకుమార్ తనకి బాడీ డబుల్ తయారు చేసుకుంటున్నారు అని ఫన్నీగా కామెంట్ చేశాడు.
ఏది ఏమైనా పుష్ప 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. పుష్ప మొదటి భాగంలో సినిమా కంటే అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఎక్కువగా డామినేట్ చేశాడు. బన్నీ స్టైల్, డ్యాన్సులు వరల్డ్ మొత్తం ట్రెండ్ అయ్యాయి.