MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూరి జగన్నాధ్ సినిమాల్లో సుకుమార్ కి నచ్చిన మూవీ ఏదో తెలుసా..పుష్ప చిత్రానికి ఆ క్యారెక్టరే స్ఫూర్తి ?

పూరి జగన్నాధ్ సినిమాల్లో సుకుమార్ కి నచ్చిన మూవీ ఏదో తెలుసా..పుష్ప చిత్రానికి ఆ క్యారెక్టరే స్ఫూర్తి ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. హీరో పాత్రని పూరి మాస్ గా చూపిస్తూనే మిగిలిన దర్శకుల కంటే వైవిధ్యంగా ప్రజెంట్ చేస్తారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 27 2024, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. హీరో పాత్రని పూరి మాస్ గా చూపిస్తూనే మిగిలిన దర్శకుల కంటే వైవిధ్యంగా ప్రజెంట్ చేస్తారు. కేవలం హీరో క్యారెక్టర్ వల్లే హిట్టైన పూరి జగన్నాధ్ చిత్రాలు బోలెడు ఉన్నాయి. 

25

ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ పూరి జగన్నాధ్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ కి స్ఫూర్తి పూరి జగన్నాధ్ గారి సినిమాలే అని తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బద్రి చిత్రం అని తెలిపారు. కేవలం హీరో క్యారెక్టర్ తోనే సినిమా నడిపించవచ్చు అని పూరి జగన్నాధ్ నిరూపించారు. 

35

బద్రి చిత్రం నాకు చాలా ఇష్టం. అప్పట్లో హీరో ఒకేసారి ఇద్దరితో లవ్ లో ఉండడం అనే అంశం చాలా రిస్క్. ప్రకాష్ రాజ్ పాత్ర కూడా నెగిటివ్ గా ఉండదు. తన చెల్లి కోసమే అతడి తపన అంతా. పూరి జగన్నాధ్ కూడా దీని గురించి చెప్పారు. ఆ సినిలో ప్రకాష్ రాజ్ కన్నా బ్యాడ్ క్యారెక్టర్ ఎవరంటే అది కళ్యాణ్ గారిదే. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో ఉంది మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. 

45

సుకుమార్ మాట్లాడుతూ ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ మామూలుగా ఉండవు. అదే చిత్రం ఇప్పుడు రిలీజ్ అయితే ఆ మ్యానరిజమ్స్ ఇండియా మొత్తం ట్రెండ్ అయ్యేవి అని సుకుమార్ తెలిపారు. ఆ స్ఫూర్తితోనే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర డిజైన్ చేసినట్లు సుకుమార్ తెలిపారు. 

55

అదే విధంగా ఇడియట్ చిత్రం కూడా చాలా ఇష్టం అని తెలిపారు. అందులో ప్రకాష్ రాజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ ని కూడా ప్రేమగా పలకరించే మంచి వ్యక్తి. కానీ కూతుర్ని ఎవరో ప్రేమిస్తున్నాడని తెలిసి బ్యాడ్ అయిపోతాడు అని సుకుమార్ అన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: క్లాసిక్ టైటిల్స్ పెట్టారు.. దెబ్బకు వాటి మార్క్‌ను చెడగొట్టేశారు.. లిస్టులో కాజల్ సినిమా..
Recommended image2
RP Patnaik: 'గాజువాక పిల్ల' పాట వెనుక అంత విషాదం ఉందా.. ఆర్పీ పట్నాయక్ ఏం చెప్పారంటే.?
Recommended image3
తెలుగు స్టార్ హీరోతో సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రయత్నం.. ఎవరితో చేయబోతున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved