సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలెబ్రేషన్స్.. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఫోటోలు వైరల్
ఇటీవల సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతి వేణి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబం మొత్తం సుకృతి బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్ప మొదటి భాగం సంచలన విజయం కావడంతో సుక్కు పుష్ప 2 కోసం అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు.
అల్లు అర్జున్ కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లేలా తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా మార్చేలా సుక్కు ప్రయత్నిస్తున్నారు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో ఏ చిత్రం తెరకెక్కుతోంది.
ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కి సన్నాహకాలు జరుగుతున్నాయి. సుకుమార్ తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తారు. సుక్కుకి తన పిల్లలు, సతీమణి అంటే అమితమైన ప్రేమ. గతంలో కూడా సుకుమార్ పెళ్ళికి ముందు తన భార్యతో జరిగిన లవ్ స్టోరీని వివరించారు.
అలాగే తానూ షూటింగ్స్ కి వెళుతుంటే తన పిల్లలు చాలా బాధపడతారని.. ఇంట్లో ఉంటే సంతోషిస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతి వేణి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
కుటుంబం మొత్తం సుకృతి బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఆ అందమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొడుకు, కుమార్తె, సతీమణితో కలసి సుకుమార్ ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సుకుమార్ కుమార్తె సుకృతి పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం నుంచే సెలేబ్రిటిగా మారిపోయింది. పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుకృతి తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడి హైలైట్ అయింది.