MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుడిగాలి సుధీర్‌ హీరో అయినా పులిహోర వేషాలు ఆపలేదుగా.. సుమ షోలో మరోసారి ప్లే బాయ్‌గా రెచ్చిపోయిన గాలోడు

సుడిగాలి సుధీర్‌ హీరో అయినా పులిహోర వేషాలు ఆపలేదుగా.. సుమ షోలో మరోసారి ప్లే బాయ్‌గా రెచ్చిపోయిన గాలోడు

సుడిగాలి సుధీర్‌ అంటే `జబర్దస్త్` షోలో ఒక ప్లేబాయ్‌ ఇమేజ్‌ ఉంది. ఆయన చేసే కామెడీ స్కిట్లన్ని అలానే ఉండటంతో ఆయనకు ఆ పేరు బాగా ముద్ర పడింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 27 2023, 06:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సుడిగాలి సుధీర్‌.. `జబర్దస్త్` షో మానేసి సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య `గాలోడు` చిత్రంతో అదరగొట్టాడు. ఇప్పుడు `కాలింగ్‌ సహస్త్ర` చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. షోస్‌లో పాల్గొంటున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అందులో భాగంగా సుడిగాలి సుధీర్‌.. యాంకర్‌ సుమ హోస్ట్ గా చేస్తున్న `సుమ అడ్డా` షోలో పాల్గొన్నారు. ఇందులో తన `కాలింగ్‌ సహస్త్ర` చిత్ర బృందంతో కలిసి వచ్చారు. దర్శకుడు, హీరోయిన్‌, కమెడియన్‌ వచ్చారు. ఈ షోలో కూడా సుడిగాలి సుధీర్‌ తనదైన ప్రత్యేకమైన డైలాగులు,పంచ్‌లు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. 
 

37

అయితే హీరోగా మూడు సినిమాలు చేసినా, మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నా, జబర్దస్త్ షోని వదిలేసినా ఆయనపై ఉన్న ఇమేజ్‌ మాత్రం తగ్గలేదని, ఇప్పటికీ తనని అలానే చూస్తున్నారని నిరూపించుకున్నాడు. అంతేకాదు తను కూడా అలానే యాక్ట్ చేయడం విశేషం. ఇందులో తన మార్క్ ప్లే బాయ్‌ గేమ్‌లు ఆడటం ఆశ్చర్యపరించింది. అంతేకాదు పాత సుధీర్‌ని బయటకు తీసుకొచ్చారు. 
 

47

సుధీర్‌ షోకి ఎంట్రీ ఇవ్వగానే `ఏయ్‌.. ` అనే కామెంట్లు వినిపించాయి. దీనికి సుధీర్‌ రియాక్ట్ అయిన తీరు ఆకట్టుకుంది. షో అయిపోయాక `ఏయ్‌` అంటూ ఆయన కూడా కామెంట్‌ చేయడం నవ్వులు పూయించింది. ఇంతలో సుమ పులిహోర తీసుకొచ్చింది. మీకు ఏ పులిహోర కావాలి బాబూ అంటే మనకు ఏ పులిహోర అయినా ఓకే, అన్నీ తినేయడమే అని చెప్పడంతో వచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ సౌండ్లు క్రేజీగా ఉన్నాయి. 
 

57

ఆ తర్వాత ఫోన్‌ చేస్తే ఎత్తడం లేదట అని సుమ అడగ్గా, నేను చేసిన ఎత్తడం లేదని హీరోయిన్‌ చెప్పింది. అదేంటి ఎవరు చేసినా ఎత్తుతవ్‌ కదా అని చెప్పగా నవ్వులు పూయించింది. ఇక పులిహోర అనగానే మనకు గుర్తొచ్చేది ఏది అని సుమ అడగ్గా.. అందరూ ఆ ప్రశ్నని పక్కన పెట్టి సుడిగాలి సుధీర్‌ పేరు చెప్పడం షాకిచ్చింది.  దీనికి సుమ రైట్ ఆన్సర్‌ అనడం సుధీర్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.
 

67

ఆ తర్వాత చిరంజీవి స్టయిల్‌లో పోకిరి డైలాగ్‌ చెప్పి అలరించాడు సుధీర్‌. ఆ తర్వాత టీమ్‌తో కలిసి `బావలు సయ్యా.. మరదలు సయ్యా.. `అనే పాటకు డాన్సు చేశాడు సుధీర్‌. ఈ పాట తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు. అంతేకాదు ఆ తర్వాత ఆ పాటని స్వయంగా పాడి రచ్చ చేశాడు. ఆ తర్వాత హీరోయిన్‌తో కాసేపు డబుల్ మీనింగ్‌ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. నవ్వులు పూయించాడు. 
 

77

అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షో మానే ఏడాదిపైనే అవుతుంది. హీరోగా బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పటికీ తన ఓల్డ్ స్టయిల్‌ డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో, ప్లేబాయ్ గేమ్‌ ఆడుతూ, పులిహోర కలుపుతూ, ప్లేబాయ్‌లా మారిపోయి రచ్చ చేస్తూ నవ్వులు పూయించాడు. తనలోని పాత సుధీర్‌ని బయటకు తెచ్చి అలరించాడు. అభిమానులను ఆకట్టుకున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved