- Home
- Entertainment
- గెస్ట్ గా వచ్చిన కృతికి లైన్ వేసిన సుడిగాలి సుధీర్... ఏకంగా పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్
గెస్ట్ గా వచ్చిన కృతికి లైన్ వేసిన సుడిగాలి సుధీర్... ఏకంగా పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్
షోకి గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ కృతి శెట్టిని లైన్ లో ప్రేట్టే ప్రయత్నం చేశాడు సుధీర్. ఏకంగా నీకు తగినవాడిని నేనే పెళ్లి చేసుకుందాం అంటూ ఇబ్బంది పెట్టాడు.

Sudigali Sudheer
బుల్లితెర స్టార్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే సుడిగాలి సుధీర్ అని టక్కున చెప్పేస్తారు. తన ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కనేశారు. వాళ్ళు స్కూల్స్ కి కూడా వెళుతున్నారు. 30 ప్లస్ లో ఉన్న సుధీర్ మాత్రం పెళ్లి మాటెత్తడం లేదు.
అయితే మనసులో పెళ్లి కోరిక బలంగానే ఉన్నట్లుంది. నచ్చిన పిల్ల కనబడితే పెళ్లంటూ గోల పెడుతున్నాడు. 20 ఏళ్ళు కూడా నిండని కృతి శెట్టి తన ప్రోగ్రాంకి గెస్ట్ గా రాగా, పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్ పెట్టాడు. విషయంలోకి వెళితే స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలేకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం వచ్చారు.
సుధీర్, కృతి శెట్టి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రమోషన్స్ లో భాగంగా వారు ఈ ఈవెంట్ కి రావడం జరిగింది. వేదికపై అనసూయ, హీరో సుధీర్, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, కృతి శెట్టితో పాటు యాంకర్ సుడిగాలి సుధీర్ ఉన్నారు.
మాటల్లో మాటగా ఇక్కడ ఉన్నవాళ్ళలో పెళ్లికాని వాళ్ళు ఇద్దరే ఒకరు కృతి శెట్టి, మరొకరు నేను అంటూ స్టార్ట్ చేశాడు. కృతి శెట్టికి లైన్ వేస్తున్నాడన్న విషయం అనసూయ గమనించింది. అదే విషయం సుడిగాలి అడగగా సిగ్గుపడుతూ లేదన్నాడు. ముందు కృతి శెట్టికి ఎలాంటి భర్త కావాలో తెలిస్తే ఈజీ అవుతుందని అనసూయ హింట్ ఇచ్చారు.
తనకు సపోర్టివ్, పాజిటివ్ యాటిట్యూడ్, కైండ్ హార్ట్ కలిగి అర్థం చేసుకునేవాడు భర్తగా కావాలి. అన్నింటికీ మించి నన్ను బాగా చూసుకోవాలి, అని కృతి చెప్పారు. ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయని సుడిగాలి సుధీర్ మరోమారు ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. మరో లక్షణంగా కొంచెం చబ్బీగా కూడా ఉండాలి అంది. నేను చబ్బీనే కావాలంటే పొట్ట చూడండి, అని సుడిగాలి సుధీర్ అన్నాడు.
మరి ఇందాక సిక్స్ ప్యాక్ అని చెప్పావ్ అని కృతి నిలదీయగా.. సిక్స్ ప్యాక్ లో కూడా చబ్బీగా ఉండవచ్చు అన్నాడు. కృతి, సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన ఈ మ్యారేజ్ ప్రపోజల్ డ్రామా రక్తికట్టింది. అందరి చేత నవ్వులు పూయించింది. ఇదంతా ఎంటర్టైన్మెంట్ లో భాగమే అని చెప్పాలి.
కాగా చాలా కాలంగా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ ప్రేమించుకుంటున్నట్లు పుకార్లు ఉన్నాయి. వారు మాత్రం ఈ వార్తలను ఖండిస్తారు, మేము స్నేహితులం మాత్రమే అని కొట్టిపారేస్తారు. రష్మీ వయసు కూడా 30 దాటిపోయింది. సుధీర్ లాగానే రష్మీ పెళ్లి అంటే నో అంటుంది. ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉంటున్నారు.