Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తో ఆ ఛానల్ బంపర్ డీల్.. అనసూయకి షాక్ ?
జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ లతో వీళ్ళు అదరగొడుతుంటారు.

జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ లతో వీళ్ళు అదరగొడుతుంటారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ పడిందంటే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావలసిందే.
సుడిగాలి సుధీర్ తన అల్లరి చేష్టలతో జబర్దస్త్ కి ఓ కళ తీసుకువచ్చాడు. రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో కలసి సుధీర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ నుంచి పాపులర్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా జారుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైపర్ ఆది జబర్దస్త్ లో స్కిట్ లు చేయడం లేదు. సుధీర్ కూడా జబర్దస్త్ కి దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.
సుధీర్ కి కావలసినంత పాపులారిటీ లభించింది. సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. దీనితో సుధీర్ కొద్దిపాటి పారితోషికంతో జబర్దస్త్ చేయడం ఎందుకు అని భావిస్తున్నాడట. అందుకే మంచి రెమ్యునరేషన్ ఆఫర్స్ వస్తుండడంతో దూసుకుపోతున్నాడు. భారీ రెమ్యునరేషన్ తో కొత్త ఆఫర్స్ రావడం వల్లే సుధీర్ జబర్డస్త్ కి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల స్టార్ మాలో సూపర్ సింగర్స్ అనే కొత్త షో ప్రారంభం అయింది. ఈ షో కోసం, భవిష్యత్తులో తమ ఛానల్స్ లో రాబోయే షోల కోసం స్టార్ మా సుధీర్ తో కాట్రాక్ట్ కుదుర్చుకుంది అని ప్రచారం జరుగుతోంది. ఈ కాట్రాక్ట్ ప్రకారం సుధీర్ కి బంపర్ రెమ్యునరేషన్ దక్కుతోందట. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల కోసం సుధీర్ కి ఆ ఛానల్ వాళ్ళు ఎపిసోడ్ కి మూడున్నర నుంచి నాలుగు లక్షల పారితోషికం ఇచ్చేవారట.
కానీ స్టార్ మాలో సుధీర్ కి ఆరున్నర నుంచి 7 లక్షల వరకు ముడుతోంది అని టాక్. స్టార్ మా లో అనసూయ కంటే సుధీర్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అని టాక్. అనసూయని సుధీర్ రెమ్యునరేషన్ విషయంలో బీట్ చేశాడంటే అది మాములు విషయం కాదు.
అలాగే సుధీర్ కామెడీ స్టార్స్ లో కూడా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కామెడీ స్టార్స్ లో నాగబాబు ఇప్పటికే జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఒకే గూటి పక్షులంతా ఒక్కచోటికి చేరబోతున్నాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.