MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కన్నీరు మున్నీరైన సుధీర్.. వర్ష, భాను రూ.లక్ష సాయం.. ప్రతి నెలా డబ్బు పంపుతా అంటూ ఇంద్రజ..

కన్నీరు మున్నీరైన సుధీర్.. వర్ష, భాను రూ.లక్ష సాయం.. ప్రతి నెలా డబ్బు పంపుతా అంటూ ఇంద్రజ..

సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్ గా మారిపోయాడు. జబర్దస్త్  షోతో క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ప్రస్తుతం పలు షోలలో సందడి చేస్తున్నాడు. సుధీర్ తో పాటు ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది కూడా ఇదేవిధంగా క్రేజ్ పొందినవారే.

2 Min read
Author : pratap reddy
Published : Sep 27 2021, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్ గా మారిపోయాడు. జబర్దస్త్  షోతో క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ప్రస్తుతం పలు షోలలో సందడి చేస్తున్నాడు. సుధీర్ తో పాటు ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది కూడా ఇదేవిధంగా క్రేజ్ పొందినవారే. ఇక బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ షోలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హృదయాన్ని హత్తుకునేలా ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో ప్రతి ఒక్కరి హృదయాలు హత్తుకునేలా ఎమోషల్ గా ఉంది.ఎప్పుడూ నవ్వించే సుడిగాలి సుధీర్ కన్నీళ్లు ఆపుకోలేక పోయాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. 

36

తాజా ఎపిసోడ్ కి ఓ ఓల్డేజ్ హోమ్ లో వృద్దులని ఆహ్వానించారు. అసలు తల్లిదండ్రులల్ని ఓల్డేజ్ హోమ్ లో వదిలేసి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనే తరహాలో ఈ ఎపిసోడ్ సాగినట్లు ఉంది. ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వారందరిని పిలిచి వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ఒక ఈవెంట్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సుధీర్ తెలిపాడు. 

46

హైపర్ ఆది ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చిన వృద్ధ మహిళలతో సరదాగా ఉంటూ నవ్వించాడు. ఓ వృద్ధురాలితో రొమాన్స్ చేస్తున్నట్లు,ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లు బిహేవ్ చేస్తూ నవ్వులు పూయించారు. దీనితో ఆటో రామ్ ప్రసాద్.. హమ్మయ్య ఆది గదికి పెయిర్ దొరికేసింది అని అంటాడు. 

56

ఓ వృద్ధురాలి పాడిన పాటకు అంతా ఫిదా అయ్యారు. కొందరు కంటతడి పెట్టుకున్నారు. ఇక సుధీర్ అయితే కన్నీరు ఆపుకోలేకపోయాడు. తనకు తెలిసిన వృద్ధురాలి సంఘటన చెప్పి అందరిని మరోసారి ఎమోషనల్ చేసాడు సుధీర్. ఇక్కడున్న వృద్దులని వాళ్ళ పిల్లలు ఇలా ఏడిపించాల్సిన అవసరం ఏముంది. మీ తల్లిందండ్రులని మీతోనే ఉంచుకోవచ్చు కదా అని సుధీర్ సలహా ఇచ్చాడు. 

66

తల్లి ప్రేమ గురించి తెలిసేలా చేసిన స్కిట్ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా అక్కడికి వచ్చిన ఓల్డేజ్ హోమ్ వారికి భాను, వర్ష ఇద్దరూ రూ లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇక నటి ఇంద్రజ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలితో మాట్లాడింది. నెలకు వీళ్లకు మెడికల్ ఖర్చులు ఎంత అవుతాయి అని అడిగింది. దీనితో ఆమె లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుందని చెప్పింది. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి.. ఇక నుంచి ప్రతి నెలా నేను డబ్బు పంపుతాను అంటూ ఇంద్రజ వారికి హామీ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved