- Home
- Entertainment
- `జబర్దస్త్`ని వదిలేసిన సుధీర్.. టెంట్ వేసుకుని న్యాయం కావాలంటూ యాంకర్ రష్మి ధర్నా..
`జబర్దస్త్`ని వదిలేసిన సుధీర్.. టెంట్ వేసుకుని న్యాయం కావాలంటూ యాంకర్ రష్మి ధర్నా..
`జబర్దస్త్` రష్మి రోడ్డెక్కింది. న్యాయం కావాలంటూ ఆమె టెంట్ వేసుకుని మరీ ధర్నాకి దిగింది. అయితే ఇటీవల జబర్దస్త్ షోని సుడిగాలి సుధీర్ విడిచిపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు రష్మి ధర్నా చేయడం హాట్ టాపిక్ అవుతుంది.

`జబర్దస్త్`(Jabardasth) షోలో తొమ్మిదేళ్లుగా రాణిస్తున్నాడు సుడిగాలి సుధీర్)Sudheer). గెటప్ శ్రీను, రాంప్రసాద్‌లతో కలిసి ఆయన స్కిట్టు చేస్తూ ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నారు. షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మరోవైపు ఆయన షోలో యాంకర్ రష్మి(Rashmi)తో నడిపించే కెమిస్ట్రీ మరింత పీక్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరి మధ్యలవ్ స్టోరీ ప్రతిసారి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.
ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయ్యారు. షోలో వీరి ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్‌లు, ఒకరిపై ఒకరు కురిపించే ప్రేమ సైతం ఇద్దరు లవర్స్ అనే అనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే చాలా సార్లు జబర్దస్త్ స్టేజ్‌పై పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. డ్యూయెట్లు పాడుకున్నారు. షోకి మరింత గ్లామర్‌తోపాటు హీటెక్కించారు. వీరిద్దరి కెమిస్ట్రీ `జబర్దస్త్` షోకి కూడా కలిసొస్తూ, టీఆర్‌పీ రేటింగ్‌ని పెంచుతుంది.
ఇదిలా ఉంటే గత కొన్ని ఎపిసోడ్లుగా సుడిగాలి సుధీర్ `జబర్దస్త్` లో కనిపించడం లేదు. ఆయన సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ కామెడీ షోని వదిలేసినట్టు తెలుస్తుంది. గెటప్ శ్రీను చాలా కాలంగానే షోకి రావడం లేదు. గత రెండు మూడు వారాలుగా సుడిగాలి సుధీర్ రావడం లేదు. దీంతో ఈ ఇద్దరు లేకపోవడం వల్ల తాను ఒంటరి వాడినైపోయాంటూ రాంప్రసాద్ సైతం ఎమోషనల్ అయ్యారు. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ రష్మి రోడ్డెక్కడం హాట్ టాపిక్ అవుతుంది. తనకు న్యాయం కావాలంటూ రోడ్డుపై టెంట్ వేసుకుని మరీ ధర్నాకి దిగింది రష్మి. కొంత మందిని వెంటేసుకుని న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. అయితే ఇమ్మాన్యుయెల్ మాత్రం ఫ్లైట్ లో చక్కర్లు కొట్టడం, రాంప్రసాద్ ఏం జరిగిందని ఆరా తీయడం మరింత ఆసక్తిని పెంచింది.
రష్మి ధర్నా చేస్తున్నది చూసిన ఇమ్మాన్యుయెల్ స్పందిస్తూ, నేను అప్పుడే చెప్పాను.. వద్దురా మనకు ఇవన్నీ అంటూ లవ్ సింబల్ చూపించారు ఇమ్మాన్యుయెల్. అయితే ఏంట్రా అది అని రాంప్రసాద్ అడగ్గా, లవ్ సింబల్స్ అంటూ సెటైరికల్‌గా చెప్పడంతో రష్మి ముఖం వాడిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాక ముఖం తిప్పేసుకుంది. అయితే ఇదంతా కామెడీగా చేసిన స్కిట్ కావడం విశేషం.
కానీ సుడిగాలి సుధీర్ `జబర్దస్త్` షోని వీడటం వల్లే రష్మి ధర్నా చేస్తుందని అంటున్నారు. సుధీర్ తనని వదలి వెళ్లిపోవడంతో రష్మి తనకు న్యాయంచేయాలని పోరాడుతుందని సెటైర్లు పేలుస్తున్నారు. ప్రేమించిన వ్యక్తి మధ్యలోనే వెళ్లిపోతే ఓ అమ్మాయి జీవితం ఏమై పోవాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం. మొత్తంగా కామెడీ కోసం చేసిన ఈ స్కిట్లు ఇప్పుడు రష్మి,సుధీర్‌ల రిలేషన్ కి ముడిపెట్టడం గమనార్హం.