వాల్తేర్ వీరయ్య V/S వీరసింహారెడ్డి.. చిరు, బాలయ్యలను కాపాడలేకపోయిన `సవతి` ప్రేమ
సంక్రాంతి పండక్కి వచ్చిన చిరంజీవి `వాల్తేర్ వీర్యయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి` చిత్రాల్లో బలమైన ఓ కామన్ పాయింట్ ఉంది. కానీ ఆది ఈ రెండు సినిమాలను కాపాడటంలో విఫలమయ్యింది.

ఈ సంక్రాంతికి సినీ అభిమానులకు పండగ ముందే వచ్చింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు ఏక కాలంలో విడుదల కావడంతో అభిమానులు, సాధారణ ఆడియెన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. ఇద్దరి హీరోల అభిమానులను ఖుషీ చేస్తున్నాయి `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి`. ఫ్యాన్స్ కి దగ్గ ఎలిమెంట్లు ఉన్న నేపథ్యంలో వాళ్ల ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
అయితే కంటెంట్ పరంగా ఈ రెండూ యావరేజ్ మూవీస్‌గానే నిలిచాయి. ఫ్యాన్స్ కి నచ్చే అంశాలున్నా, సినిమాలు అసలు మ్యాటర్ వీక్‌గా ఉండటంతో ఈ రెండు మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో వీటికి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. కలెక్షన్లు బాగానే వస్తుంటాయి. కానీ మెయిన్ కంటెంట్ విషయమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని ఆ విషయాల్లో విఫలం అయ్యారు.
Chiranjeevi-Balakrishna
రాసుకోకపోవడమే ఈ సినిమాలు యావరేజ్ ఫలితానికి పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో `సవతి` ప్రేమ అనేది ఓ కామన్ పాయింట్‌గా ఉంది. అదే సినిమాకి మెయిన్ పాయింట్. వాటి చుట్టూతే సినిమా తిరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`వాల్తేర్ వీరయ్య` సినిమాల్లో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములు. చివరి వరకు వీరిద్దికి పడనట్టుగానే ఉంటారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే చిరంజీవి కారణంగానే రవితేజ పాత్ర చనిపోతుంది. అయితే వీరిద్దరు సవతి తల్లి పిల్లలు. తండ్రి ఒక్కరే. ఒక సంఘటనతో ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పార్థాలు వీరిద్దరిని దూరం చేస్తాయి. చివరికి కలిసే లోపు రవితేజ పాత్ర చనిపోతుంది. తమ్ముడి మరణానికి కారణమైన విలన్లని మట్టుపెడతాడు చిరంజీవి. అంతటితో కథ ముగుస్తుంది.
మరోవైపు `వీరసింహారెడ్డి` చిత్రంలో బాలకృష్ణ, వరలక్ష్మి అన్నా చెళ్లెళ్లు. ఓ పెద్ద సంఘటనతో బాలకృష్ణ, వరలక్ష్మి దూరమవుతారు. అన్నపై కక్ష్య పెంచుకున్న చెల్లి ఆయన చావుని కళ్ల చూడాలని విలన్లలో కలుస్తుంది. కానీ అసలు నిజం తెలుసుకుని వరలక్ష్మి మారే లోపు బాలకృష్ణ(పెద్ద) పాత్ర చనిపోతుంది. అన్నని తనే చంపేస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే వీరిద్దరు సవతి తల్లి బిడ్డలు. తండ్రి ఒక్కడే. చెల్లి మరణానికి కారణమైన విలన్లని అంతం చేస్తాడు చిన్న బాలకృష్ణ. అంతటితో కథ ముగుస్తుంది.
ఇలా ఈ రెండు సినిమాల్లో `సవతి` తల్లి బిడ్డల ప్రేమ అనేది అంతర్లీనంగా హైలైట్ పాయింట్ అయినా, ఆ ప్రేమ ఈ రెండు చిత్రాలను కాపాడలేకపోయాయి. వెండితెరపై అంతగా పండలేదు. `వీరసింహారెడ్డి` వరలక్ష్మి పాత్ర విలన్లతో కలవడమనేది చాలా వీక్ పాయింట్. లాజిక్ లెస్. సెంటిమెంట్ కాస్త వర్కౌట్ అయినా, పాయింట్ వీక్‌గా ఉండటం పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు `వాల్తేర్ వీరయ్య`లో చిరంజీవి, రవితేజ దూరం అయ్యే సన్నివేశాలు కూడా అంతే వీక్ గా ఉంటాయి. వీరిద్దరి మధ్య బ్రదర్స్ ఎమోషన్స్ పండలేదు. దీంతో రెండూ తేలిపోయాయి. ఈ రెండు సినిమాల్లో ఈ సన్నివేశాలే మరింత ఎమోషనల్‌గా ఉండి, సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అయితే సినిమా ఫలితాలు వేరే లెవల్‌లో ఉండేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Waltair Veerayya- Veera Simha Reddy
ఇలా ఈ రెండు సినిమాల్లో కామన్‌గా, మెయిన్‌గా ఉన్న `సవతి` ప్రేమ చిరు, బాలయ్యలను కాపాడలేకపోయాయనే టాక్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తుండటం గమనార్హం. అదే పండిఉంటే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యేవంటున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తుండటం విశేషం.