MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivatmika: లాక్ డౌన్ లుక్ అంటూ మైండ్ బ్లాక్ చేస్తున్న శివాత్మిక... పొట్టి గౌనులో కిరాక్ ఫోజులతో రచ్చ!

Shivatmika: లాక్ డౌన్ లుక్ అంటూ మైండ్ బ్లాక్ చేస్తున్న శివాత్మిక... పొట్టి గౌనులో కిరాక్ ఫోజులతో రచ్చ!

లాక్ డౌన్ లుక్ అంటూ కేక పుట్టించింది స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajashekar). చిన్న గౌను ధరించి మైండ్ బ్లాక్ చేసింది. యంగ్ బ్యూటీ సరికొత్త అందాలు చూసి యూత్ మైండ్ బ్లాక్ అవుతుండగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 13 2022, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా శివాత్మిక ప్రతిభ కనబరిచారు. దొర కూతురు పాత్రలో శివాత్మిక అలరించారు. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ.

38

అక్క శివాని (Shivani) కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. అచ్చ తెలుగు అందాల ఈ సుందరి టాలెంట్ ని దర్శక నిర్మాతలు గుర్తించకపోవడం బాధారకమని చెప్పాలి.

48


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత లేదు. 

58

 
అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. దొరసాని చిత్రంతో నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

68


రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాలతో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా శివాత్మిక కెరీర్ కి ఎంతవరకు  ఉపయోగపడతాయో చూడాలి. అలాగే శివాత్మికకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. 

78

 మరోవైపు శివాత్మిక అక్క శివాని 'అద్భుతం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఓటిటిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివాని పెర్ఫార్మన్స్ క్రిటిక్స్ ని మెప్పించడం విశేషం. శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

88

శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Recommended image2
Radhika Sarathkumar: నన్ను దారుణంగా మోసం చేశారు.. హీరోయిన్‌ రాధికపై సీనియర్‌ నటి సంచలన ఆరోపణలు
Recommended image3
Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved