MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పెళ్లైనా సరే, వెంకటేష్‌నే చేసుకుంటా.. ఇంట్లో పెద్ద గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సౌందర్య కాదు

పెళ్లైనా సరే, వెంకటేష్‌నే చేసుకుంటా.. ఇంట్లో పెద్ద గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సౌందర్య కాదు

విక్టరీ వెంకటేష్‌, సౌందర్య మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారనే పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ మరో స్టార్‌ హీరోయిన్‌ వెంకీనే మ్యారేజ్‌ చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిందట.   

Aithagoni Raju | Published : Mar 26 2025, 08:43 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Venkatesh

Venkatesh

వెంకటేష్‌ అనుకోకుండా హీరో అయ్యాడు. బేసిక్‌గా ఆయన బిజినెస్‌ పెట్టుకుని ఫారెన్‌లో సెటిల్‌ కావాలనుకున్నారు. కానీ కృష్ణ హ్యాండివ్వడంతో తండ్రి రామానాయుడు వెంకటేష్‌ని హీరో చేశాడు. హిట్‌కొట్టాడు. అలా యాక్సిడెంటల్‌గా హీరో అయిన వెంకీని చాలా మంది హీరోయిన్లు ఇష్టపడ్డారు.

సౌందర్యతో పెళ్లి వరకు వెళ్లారనే రూమర్‌ ఉంది. అలాగే మరో స్టార్‌ హీరోయిన్‌ కూడా వెంకీపై మోజు పడిందట. ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పెద్ద గొడవనే పెట్టుకుందట. మరి ఆ కథేంటో చూద్దాం. 

25
Soundarya, Venkatesh

Soundarya, Venkatesh

వెంకటేష్‌ ఆల్మోస్ట్ పెళ్లి అయిన తర్వాతనే సినిమాల్లోకి వచ్చాడు. అయితే వెంకీ చాలా డీసెంట్‌గా, కూల్‌గా ఉంటాడు. అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. ముఖ్యంగా ఆడవారికి. అదే ఆయనకు అసెట్. చూడ్డానికి అందంగానూ ఉంటాడు. అందుకే ఆయన్ని అమ్మాయిలు ఇష్టపడతారు.

అయితే సౌందర్యతో కలిసి ఎక్కువ సినిమాలు చేశాడు వెంకీ. వీరి మధ్య మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారని, పెళ్లి వరకు వెళ్లారనే రూమర్‌ వినిపిస్తుంది. తండ్రి రామానాయుడు మందలించడంతో వెనక్కి తగ్గారని టాక్. 

35
raasi

raasi

కానీ ఓ స్టార్‌ హీరోయిన్‌ మాత్రం నేను వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిందట. ఆమె ఎవరో కాదు రాశీ. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది రాశీ. చెన్నైలో విజయ, ఏవీఎం స్టూడియోల వద్దనే తమ పేరెంట్స్ టీషాప్‌ నడిపించేవాళ్లట. ఆ సమయంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అక్కడికి వచ్చి టీ తాగేవారట.

ఓ సారి రాశీ మేగజీన్‌పై వెంకటేష్‌ ఫోటోలు చూసింది. అలాగే ఆయన నటించిన సినిమాలు చూసింది. అప్పటికీ ఆమెది చిన్న వయసు. టీనేజ్‌కి తక్కువగానే ఉంటుంది. ఆ సమయంలోనే తాను వెంకటేష్‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ పెట్టుకుందట. 
 

45
Venkatesh

Venkatesh

రాశీ వాలకం చూసి పేరెంట్స్ ఆశ్చర్యపోయారట. ఈ పిల్ల ఇలా బిహేవ్‌ చేస్తుందేంటి? అని అనుకునేవాళ్లట. ఏమీ తెలియని ఏజ్‌ కావడంతో నవ్వుతూ మందలించారట. అయితే చిన్నప్పుడు రాశీకి పెళ్లి అంటే చాలా పిచ్చి ఉండేదట. స్కూల్‌లో భవిష్యత్‌లో ఏం అవుతావని టీచర్‌ అడితే హౌజ్‌ వైఫ్‌ అవుతానని చెప్పిందట.

ఆ పెళ్లి ఆసక్తితోనే వెంకటేష్‌కి మ్యారేజ్‌ అయినా సరే బాగున్నాడని ఆయన్నే మ్యారేజ్‌ చేసుకుంటానని మరాం చేసిందట. అంతటితో ఆగలేదు, ఓ సారి రాజీవ్‌ గాంధీ ఫోటో మేగజీన్‌లో వస్తే ఆయన్ని చూసి కూడా ఆయన్నే మ్యారేజ్‌ చేసుకుంటానని గొడవ పెట్టుకుందట. ఇలా చిన్నప్పుడే చాలా కథ నడిపించింది రాశీ. ఓ ఇంటర్వ్యూలో ఆమెనే ఈ విషయాలను వెల్లడించింది. 

55
Raasi

Raasi

రాశీ..1988లో `రావు గారి ఇల్లు` అనే సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో నాగేశ్వరరావు హీరో. ఇలా వరుసగా `ఆదిత్య 369`, `అంకురం`, `పల్నాటి పౌరుషం` వంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది.

1997లో `శుభాకాంక్షలు` మూవీతో హీరోయిన్‌గా మారింది. తెలుగులో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. చివరగా ఆమె 2017లో `లంక` అనే మూవీలో నటించింది. ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉంది. రాశీ.. దర్శకుడు శ్రీముణిని ప్రేమించి పెళ్లిచేసుకుంది.  

read  more: రామ్‌ చరణ్‌ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్‌.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా బుచ్చిబాబు ఏం ఇవ్వబోతున్నాడంటే

also read: అల్లు అర్జున్ సినిమా ఎవ్వరికీ తెలియని ఓ గాడ్ కథ

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
దగ్గుబాటి వెంకటేష్
సౌందర్య
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories