- Home
- Entertainment
- Samantha first Salary : సమంత ఫస్ట్ శాలరీ.. ఒక్క షర్ట్ కూడా రాదు.. సామ్ మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా
Samantha first Salary : సమంత ఫస్ట్ శాలరీ.. ఒక్క షర్ట్ కూడా రాదు.. సామ్ మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా
సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) తన జీవితంలో ఎంతగానో కష్టపడింది. ఇప్పుడు ఒక షర్ట్ కూడ రాని జీతానికి సామ్ నెలంతా ఉద్యోగం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నేళ్లుగా సామ్ సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు.
రెగ్యులర్ హీరోయిన్లలా కాకుండా తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ విభిన్నంగానే కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. తన పాత్రకు ప్రాధ్యానత ఉండే సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.
సామ్ చివరిగా ‘ఖుషి’ చిత్రంతో అలరించింది. ఈ చిత్రం తన ఆరోగ్యంపైనే పూర్తిగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇటీవల నయా లుక్స్ లో, స్టైలిష్ వేర్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్ ను ఊపేసేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఇలా నిత్యం అభిమానులకు టచ్ లోనే ఉంటోంది.
ఈ క్రమంలోనే సామ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సామ్ మొదట ఏ ఉద్యోగం చేశారు? ఎంత శాలరీకి పనిచేశారనేది ఆసక్తికరంగా మారింది.
సామ్ మొదట ఒక హోటల్ లో హోస్టెస్ గా వర్క్ చేసింది. ఎనిమిది గల ఫిష్ట్ లో చాలా కాలం వర్క్ చేసిందంట. అలా తన మొదటి శాలరీ రూ.500లు అందుకున్నట్టు రీసెంట్ గా సామ్ వెల్లడించింది. ఈ లెక్కన సామ్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందనేని అర్థం చేసుకోవచ్చు.