ఆ సీన్ ఉంటేనే సినిమాలో నటిస్తానంటున్న కృతి శెట్టి, ఆ సీన్ మీద అంత మోజు ఎందుకో..?
టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ డమ్ తో పాటు..స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేస్తున్న ఈ బ్యూటీ.. తన ప్రతీ సినిమాలో ఒక సీన్ పక్కాగా కావాలంటూ డిమాండ్ చేస్తుందట. ఇంతకీ ఏంటా సీన్.

టాలీవుడ్ లో చాలా తక్కువ టైమ్ లో చాలా తక్కువ ఏజ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో జతకట్టి తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే టాప్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్ళిపోయింది.
ఇక తన ప్రతీ మూవీ లో సెంటిమెంట్ గా ఒక సీన్ పక్కాగా ఉండాలంటోంది కృతి శెట్టి. ఆ ఇంట్రెస్టింగ్ సీన్ మేటర్ రీసెంట్ గానే లీక్ చేసింది. తను నటించిన ప్రతిసినిమా లో హీరోతో కలిసి బైక్ పై షికారు కు వెళ్లే సీన్స్ ఖచ్చితంగా ఉండాలంటోందట. ఆసీన్ ఉంటేనే చేస్తానంటుందట. బైక్ సీన్ తనకు సెంటిమెంట్ అంటోంది కృతి.
ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టింది బేబమ్మ. ఇప్పటి వరకు కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమాలో ఈ సీన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకుంటూ వచ్చిందట. ఇక ముందు కూడా ఈ సీన్ పక్కాగా ఉండేట్టు డిమాండ్ చేస్తుందట కృతి.
సినిమా హిట్ అయినా... ప్లాప్ అయినా.. తన సెంటిమెంట్ మాత్రం గౌరవించాల్సిందే అంటోంది. రీసెంట్ గా కృతి నటించిన ది వారియర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ రకంగా ఆమె సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందంటున్నారు.
హ్యాట్రిక్ హిట్ తరువాత ఫస్ట్ టైమ్ ప్లాప్ ఫేస్ చేసింది బ్యూటీ. రామ్ హీరోగా లింగు స్వామి డైరెక్షన్ లో వచ్చిన ది వారియర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ రావడంతో కృతి ఖాతాలో ఫస్ట్ ప్లాప్ పడింది. అయితే రీసెంట్ గా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది.
వరుసగా హ్యాట్రిక్ కొట్టారుగా.. నాలుగో సినిమా ది వారియర్ మాత్రం దెబ్బకొట్టింది... దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా..అదంతా టీం వర్క్ అని ఒక హీరో వల్ల సినిమా హిట్ అవదు అని, అలా అని ఒక హీరోయిన్ వల్ల కూడా సినిమా ఫ్లాప్ అవ్వదని, ఏం జరిగినా అది మొత్తం సినిమా టీం వల్ల జరుగుతుంది అని చెప్పుకొచ్చింది.
krithi shetty
ఈ అమ్మడు విప్పిన సీక్రేట్ ను బట్టి చూస్తుంటే.. ముందు ముందు కృతి శెట్టి సినిమాల్లో పక్కాగా బైక్ సీన్ ఉంటుందని అర్ధం అయ్యింది. ఈ బ్యూటీ నటిస్తున్న తర్వాతి మూవీ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాపై కూడా భారీ హైప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అందులో బైక్ రైడింగ్ సీన్స్ ఉంటాయో లేదో ఒకవేళ ఉంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి.
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినమాలు చేస్తోంది కృతి శెట్టి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. బిజీ బిజీ అయిపోయింది. హీరో నాని తో శ్యాం సింగరాయ్ లో నటించి మెప్పించింది బేబమ్మ..అలాగే నాగార్జున తో బంగార్రాజు సినిమా లో నటించి హ్యాట్రిక్ హిట్ కొట్టి టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.