స్టార్ హీరో హిట్ మూవీ మళ్ళీ పుడుతుంది... ఇప్పుడిదో కొత్త ట్రెండ్!
చేసిందే చేస్తే కిక్ ఏముంది.. ఏదైనా కొత్తగా ఆలోచించాలి. ఒకప్పుడు స్టార్ హీరోల బర్త్ డేస్ అంటే ఫ్యాన్స్ ఫోటోకి పాలాభిషేకాలు చేసేవాళ్ళు. అన్నదానాలు, రక్తదానాలు చేయడం, హాస్పిటల్స్ లో పేషెంట్స్ కి పళ్ళు పంచడం లాంటివి చేసే వాళ్ళు.

hbd pawan kalyan
కొత్తగా ఓ ట్రెండ్ దూసుకొచ్చింది. సదరు హీరోల హిట్ చిత్రా రీరిలీజ్. ఫ్యాన్స్ కి మరచిపోలేని కిక్ ఇచ్చిన అభిమాన హీరో ఒకప్పటి చిత్రాన్ని మరలా ప్రదర్శించి అంతులేని ఆనందం పొందుతున్నారు. స్పెషల్ షోస్ ఏర్పాటు చేసి టికెట్స్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ఆ డబ్బులు ఛారిటీ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.
Hbd Pawan kalyan
ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు కాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా లో పోకిరి, ఒక్కడు స్పెషల్ షోస్ వేశారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో పోకిరి స్పెషల్ షోస్ వేశారు. ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ దక్కింది. ఏకంగా కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ తో మూవీ దుమ్మురేపింది. ఏదో సాధారణ రిలీజ్ మాదిరి పోకిరి రీరిలీజ్ ఓ రేంజ్ లో సౌండ్ చేసింది.
Hbd Pawan kalyan
కాగా పోకిరితో మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డు బ్రేక్ చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే నేపథ్యంలో జల్సా 4కే రీరిలీజ్ చేస్తున్నారు. దాదాపు 500 పైగా షోస్ తో కొత్త రికార్డు సృష్టించాలని గట్టి సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో జల్సా , తమ్ముడు చిత్రాల స్పెషల్ షోస్ వేయనున్నారు.
ఇప్పటికే జల్సా, తమ్ముడు చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలకు విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. పవన్ బర్త్ డే సందర్భంగా తోటి అభిమానులతో కలిసి మూవీ చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్ లో పేరుగాంచిన ప్రసాద్ ఐమాక్స్ తో పాటు పలు థియేటర్స్ లో ఈ చిత్రాల ప్రదర్శన జరగనుంది.
Hbd Pawan kalyan
మరి ఇంత జరుగుతుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వాళ్ళు అప్పుడే సందడి షురూ చేశారు. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు కాగా బిల్లా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. పవన్, మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి మించి తమ హీరో బర్త్ డే సెలెబ్రేషన్స్ ఉండాలి అంటున్నారు. బిల్లా మూవీ రీ రిలీజ్ భారీ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో బిల్లా చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ చిత్రంలో ప్రభాస్ డాన్ గా, చిన్నపాటి దొంగగా రెండు భిన్నమైన రోల్స్ చేశారు.
అలాగే చిరంజీవి బర్త్ డే నాడు కూడా ఫ్యాన్స్ ఇలాంటి ఏర్పాట్లు చేశారు. నాగబాబు కార్నివాల్ పేరున పెద్ద వేడుక ఏర్పాటు చేశాడు. ఘరానా మొగుడు ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. నెక్స్ట్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ హీరోల బర్త్ డేస్ కి హిట్ చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ నయా ట్రెండ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. అదే సమయంలో జేబులకు చిల్లు వేస్తుంది.