MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ హీరోగా భక్తిరస చిత్రం.. స్టార్‌ డైరెక్టర్‌ భారీ ప్లాన్‌.. నోరుమూసుకుని చేయాల్సిందే..

ప్రభాస్‌ హీరోగా భక్తిరస చిత్రం.. స్టార్‌ డైరెక్టర్‌ భారీ ప్లాన్‌.. నోరుమూసుకుని చేయాల్సిందే..

ప్రభాస్‌ యాక్షన్‌, పౌరాణికాలు, సైన్స్ ఫిక్షన్‌ చిత్రాలు చేశారు. కానీ పూర్తి భక్తిరస చిత్రం చేయలేదు. ఓ స్టార్‌ డైరెక్టర్‌ మాత్రం డార్లింగ్‌తో అలాంటి సినిమాకి ప్లాన్‌ చేశాడు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 17 2024, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్‌ పేరు ఇప్పుడు ఇండియా మొత్తం వినిపిస్తుంది. `కల్కి 2898 ఏడీ` సినిమాతో ఆయన ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్లు దాటింది. విదేశాల్లోనూ ఈ సినిమా దుమ్మురేపుతుంది. నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తుంది. నాన్‌ `బాహుబలి 2` రికార్డులను బ్రేక్‌ చేసింది. మరి `బాహుబలి 2`ని టచ్‌ చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇది మరిన్ని కలెక్షన్లని రాబట్టే అవకాశం ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రభాస్‌ ఇప్పటి వరకు యాక్షన్‌ మూవీస్, సెంటిమెంట్‌ మూవీస్‌, లవ్‌ స్టోరీస్‌ కూడా చేశాడు. వీటితోపాటు పౌరాణిక చిత్రాల్లో నటించారు. `కల్కి`తో సైన్స్ ఫిక్షన్‌ కల కూడా నెరవేరింది. రామాయణం ఆధారంగా `ఆదిపురుష్‌` చేశాడు. కానీ ఆయన్నుంచి పూర్తి స్థాయిలో భక్తిరస చిత్రం రాలేదు. ఓ స్టార్‌ డైరెక్టర్‌ ప్రభాస్ తో అలాంటి భక్తిరస సినిమా చేయాలని ప్లాన్‌ చేశాడు. అందుకు డార్లింగ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం. 

36

మరి ఆ కథేంటో చూస్తే.. రాఘవేంద్రరావు జర్నీని, ఆయన సినిమాల జర్నీని చర్చించే కాన్సెప్ట్ తో `సౌందర్యలహరి` అనే ప్రోగ్రామ్‌ చేశారు. ఇందులో ఒక్కో సినిమా గురించి చర్చిస్తారు. అందులో ఆ పాటల గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అలాగే సీన్లు ఎలా తీయాల్సి వచ్చింది, అందులో ప్రత్యేకత ఏంటో చెబుతుంటారు. గెస్ట్ లు కూడా పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఇదంతా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకుడిగా ఆయన గొప్పతనాన్ని వర్ణించే ప్రక్రియ. 
 

46

అప్పట్లో బాగానే రన్‌ అయ్యింది. ఫ్యాన్స్ కి క్యూరియాసిటీ కలిగించింది. ఇందులో ఓ సారి రాజమౌళి, ప్రభాస్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు గొప్పతనం చెప్పాడు ప్రభాస్‌. ఎన్టీఆర్‌తో `అడవి రాముడు`, చిరంజీవితో `ఘారానా మొగుడు`, పెదనాన్న కృష్ణంరాజుతో `బొబ్బలి బ్రహ్మన్న` చిత్రాలు చేశారని, అన్నీ కెరీర్ బెస్ట్ మూవీస్ ఇచ్చారని తెలిపారు ప్రభాస్‌. 
 

56

ఈ క్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ, తనకు ప్రభాస్‌తో సినిమా చేయాల్సి వస్తే పూర్తి స్థాయి భక్తిరస సినిమా చేయాలని ఉందన్నాడు రాఘవేంద్రరావు. దీనికి ప్రభాస్‌ స్పందిస్తూ, ఏమో సర్‌ అది ఎలా ఉంటుందో తెలియదు, చాలా కొత్తగా ఉంటుంది. కానీ మీరు చేస్తానంటే మరో మాట లేదు. నోరు మూసుకుని చేయాల్సిందే అన్నారు ప్రభాస్‌. అలా డార్లింగ్‌తో రాఘవేంద్రరావు ఓ భక్తిరస చిత్రం చేయాలని భావించారు. ప్రభాస్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ చేసి ఉంటే అది ఎలా ఉండేదో ఊహించుకుంటేనే విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అంటే మాస్‌ హీరో. ఆయన్ని తీసుకుని దేవుళ్ల చుట్టూ తిప్పితే జనం చూస్తారా? అనేది డౌట్‌. గతేడాది వచ్చిన `ఆదిపురుష్‌`నే ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది పూర్తి దేవుడితో కూడిన సినిమా అంటే కష్టమనే చెప్పాలి. 
 

66

ఇక ప్రభాస్ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం `ది రాజాసాబ్‌`పై ఫోకస్‌ పెట్టాడు. దీన్ని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనంతరం హను రాఘవపూడి సినిమా స్టార్ట్ కానుందట. ఈ ఏడాది చివర్లో సందీప్‌ రెడ్డి వంగా ఫిల్మ్ `స్పిరిట్‌` ఉండబోతుంది. అలాగే `సలార్‌ 2` సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు `కల్కి 2` కూడా ఉంది. ఇలా ఐదు సినిమాల లైనప్‌తో మరో మూడునాలుగేళ్లు బిజీగా ఉండబోతున్నారు ప్రభాస్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved