MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరు, నాగ్‌, వెంకీలతో బ్లాక్‌ బస్టర్స్ తీసి, బాలయ్యకి మాత్రం హిట్ ఇవ్వలేకపోయిన స్టార్‌ డైరెక్టర్‌ ఎవరోతెలుసా?

చిరు, నాగ్‌, వెంకీలతో బ్లాక్‌ బస్టర్స్ తీసి, బాలయ్యకి మాత్రం హిట్ ఇవ్వలేకపోయిన స్టార్‌ డైరెక్టర్‌ ఎవరోతెలుసా?

ఎన్టీఆర్‌ నుంచి చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున వంటి ఎంతో మంది హీరోలకు సూపర్‌ హిట్లు ఇచ్చిన స్టార్‌ డైరెక్టర్‌ బాలయ్యకి మాత్రం ఒక్క హిట్‌ కూడా ఇవ్వలేదు. ఆయనెవరో తెలుసా?  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 30 2024, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆయన తెలుగులో వందకుపైగా సినిమాలు చేశారు. అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించారు. కమర్షియల్‌ మీటర్‌ని పరిచయం చేసిన దర్శకుడిగా నిలిచారు. గ్లామర్‌ కి కొత్త అర్థాన్ని చెప్పిన దర్శకుడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలయ్య, రాజశేఖర్‌, జగపతిబాబు ఇలా అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అందరికి హిట్లు ఇచ్చారు. బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు చేశాడు. కానీ ఒక్క బాలయ్యకి మాత్రం హిట్‌ ఇవ్వలేకపోయాడు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ స్టార్‌ డైరెక్టర్‌ ఎవరో కాదు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. ఆయన కమర్షియల్‌ సినిమాల ట్రెండ్‌ని పరిచయంచేసి, తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించారు. టాప్‌ హీరోల నుంచి ఇప్పుడు సూపర్‌ స్టార్లుగా ఉన్న హీరోలందరితోనూ సినిమాలు చేశారు. చాలా మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు సినిమా అంటే జనం థియేటర్లకి క్యూ కట్టిన రోజులున్నాయి. 
 

36

అంతగా పేరుతెచ్చుకున్నరాఘవేంద్రరావు, ఎంతో మందికి హిట్లు ఇచ్చిన ఆయన బాలకృష్ణకి మాత్రం ఒక్క హిట్‌ కూడా ఇవ్వలేకపోయారు. మరి వీరి కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చాయి. హిట్‌ రాకపోవడానికి కారణమేంటి? అనేది చూస్తే.. రాఘవేంద్రరావు.. ఎన్టీఆర్‌కి సైతం `అడవిరాముడు` లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయనతో పలు సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన `రౌడీ రాముడు కొంటె కృష్ణుడు` చిత్రంతో బాలకృష్ణ కూడా నటించారు. రాఘవేంద్రరావు, బాలయ్య కాంబినేషన్‌ ప్రారంభమైంది ఇక్కడే. 
 

46

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా నటించాడు బాలయ్య. కానీ ఈ సినిమా ఆడలేదు. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. దీంతోపాటు `పట్టాభిషేకం` సినిమా చేశారు. ఇందులో బాలయ్య సోలో హీరో. ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇది కూడా డిజప్పాయింట్‌ చేసింది. అలాగే `అపూర్ సహోదరులు`, మరోవైపు `సాహస సామ్రాట్`, `దొంగరాముడు`, `పాండురంగడు` `అశ్వమేథం` వంటి సినిమాలు చేశారు. మొత్తంగా వీరి కాంబినేషన్‌లో ఏడు సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క హిట్‌ కూడా పడలేదు. 

56

దీంతో బాలయ్యకి హిట్‌ ఇవ్వలేదనే వెలితి రాఘవేంద్రరావులో ఉందట. తండ్రి ఎన్టీఆర్‌కి హిట్లు ఇచ్చాడు. కమర్షియల్‌గా నిలబెట్టాడు. అలాగే అందరు హీరోలతోనూ కెరీర్‌ బెస్ట్ మూవీస్‌ చేశారు. ఆకట్టుకున్నారు. కానీ బాలయ్య విషయంలోనే హిట్‌ రాకపోవడంతో దర్శకేంద్రుడు చాలా బాధపడ్డారు. మళ్లీ ఆయనతో సినిమా చేయాలని ప్లాన్‌ చేసినా వర్కౌట్‌ కాలేదు. సినిమా స్టార్ట్అయి ఆగిపోయిందని తెలిసింది.  
 

66

ఇక ప్రస్తుతం బాలకృష్ణ వరుస సక్సెస్‌లో ఉన్నారు. సినిమాల్లో హాట్రిక్‌ కొట్టాడు. అటు రాజకీయాల్లో నూ హ్యాట్రిక్‌ కొట్టాడు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే 109` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు బోయపాటితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాఘవేంద్రరావు సినిమాలు ఆపేశారు. తన బ్యానర్‌లో ఇతర దర్శకులతో కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
Recommended image3
Sunil: లాయర్లుగా రఫ్ఫాడించబోతున్న సునీల్, క్రేజీ హీరోయిన్.. మరో విలక్షణ పాత్రలో ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved