Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Sreemukhi: యాంకర్ శ్రీముఖి అమ్మను చూశారా? రిటైరైన హీరోయిన్ లా ఎంత గ్లామరస్ గా ఉన్నారో.. ఫోటోలు వైరల్ 

Sreemukhi: యాంకర్ శ్రీముఖి అమ్మను చూశారా? రిటైరైన హీరోయిన్ లా ఎంత గ్లామరస్ గా ఉన్నారో.. ఫోటోలు వైరల్ 

స్టార్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో పాటు తమ్ముడిని పరిచయం చేశారు. చాలా క్యూట్ గా ఉన్న ఈ ఫ్యామిలీ ఫొటోలో శ్రీముఖి మదర్ స్పెషల్ అట్రాక్షన్  గా నిలిచారు.

Sambi Reddy | Published : Apr 18 2022, 11:06 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Sreemukhi

Sreemukhi


శ్రీముఖి మదర్ సినిమాల నుండి రిటైర్ అయిన 90ల నాటి హీరోయిన్ లా చాలా గ్లామరస్ గా ఉన్నారు. ఆమె తండ్రి సైతం చక్కని హెయిర్ స్టైల్ తో చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. కజిన్ మ్యారేజ్ కి హాజరైన శ్రీముఖి ఆ వేడుకలో కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

211
Sreemukhi

Sreemukhi

నేటితో శ్రీముఖి గ్లామర్ రహస్యం తేలిపోయింది. అందమైన పేరెంట్స్ నుండి ఆమెకు సహజంగా గ్లామర్ సక్రమించినట్లు క్లారిటీ వచ్చింది.  ఇక ఈ బుల్లితెర రాములమ్మ సోషల్ మీడియాలో రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తుంది. బుల్లితెరపై వరుస అవకాశాలు తలుపుతడుతున్న నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. 
 

311
Sreemukhi

Sreemukhi


స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి  (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో  ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 
 

411
Sreemukhi

Sreemukhi


అలాగే  శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. బుల్లితెరపై శ్రీముఖికి  క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. 

511
Sreemukhi

Sreemukhi

మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.

611
Sreemukhi

Sreemukhi


ఇక శ్రీముఖి వెండితెర అవకాశాలు పరిశీలిస్తే... మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య రోల్ చేసిన శ్రీముఖికి నటిగా వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. అనసూయ మాదిరి నటిగా ఆమె బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులలో మంచి పాపులారిటీ ఉండగా దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

711
Sreemukhi

Sreemukhi

బిగ్ బాస్(Bigg boss) షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తర్వాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. 
 

811
Sreemukhi

Sreemukhi

తాజాగా జాతిరత్నాలు పేరుతో ఓ కామెడీ షో ప్రారంభమైంది. ఈటీవి ప్లస్ లో ప్రసారమవుతున్న ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి చేస్తున్నారు. స్టాండప్ కామెడీతో సాగే ఈ షోకి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణ అవుతారనడంలో సందేహం లేదు. రష్మీ, అనసూయలను కూడా పక్కన పెట్టి ఈ ఛాన్స్ ఆమె దక్కించుకున్నారు. 

911
Sreemukhi

Sreemukhi


 షో జాతిరత్నాలు తో శ్రీముఖి ఎన్ని సంచలనాలు నమోదు చేయనున్నారో చూడాలి. ఇప్పటికే పలు ఈవెంట్స్ తో బిజీగా ఉన్న శ్రీముఖి హాట్ ఫేవరేట్ యాంకర్ గా కొనసాగుతున్నారు. జాతిరత్నాలు షోకి శ్రీముఖి యాంకర్ గా రావడం ఆమె ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. 

1011
Sreemukhi

Sreemukhi

స్టార్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో పాటు తమ్ముడిని పరిచయం చేశారు. చాలా క్యూట్ గా ఉన్న ఈ ఫ్యామిలీ ఫొటోలో శ్రీముఖి మదర్ స్పెషల్ అట్రాక్షన్  గా నిలిచారు.

1111
Sreemukhi

Sreemukhi

స్టార్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో పాటు తమ్ముడిని పరిచయం చేశారు. చాలా క్యూట్ గా ఉన్న ఈ ఫ్యామిలీ ఫొటోలో శ్రీముఖి మదర్ స్పెషల్ అట్రాక్షన్  గా నిలిచారు.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories