MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమెరికా అబ్బాయితో రష్మీ గౌతమ్ పెళ్లి, జాతకాలు కూడా చూపించారు... మరి సుధీర్ పరిస్థితి ఏంటి?

అమెరికా అబ్బాయితో రష్మీ గౌతమ్ పెళ్లి, జాతకాలు కూడా చూపించారు... మరి సుధీర్ పరిస్థితి ఏంటి?

యాంకర్  రష్మీ గౌతమ్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది . ఆమె మాత్రం ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. అయితే ఎట్టకేలకు ఆమెకు పెళ్లి ఘడియలు వచ్చాయట. అమెరికా అబ్బాయిని రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకుంటుందట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 01 2024, 06:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Rashmi Gautam

Rashmi Gautam

జబర్దస్త్ షో వేదికగా ఎదిగిన స్టార్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ బ్రేక్ రాకపోవడంతో యాంకర్ గా టర్న్ తీసుకుంది. జబర్దస్త్ షోలో పాపులారిటీ తెచ్చుకున్నాక హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక నెరవేరింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ గౌతమ్ పలు చిత్రాల్లో లీడ్ హీరోయిన్ గా చేసింది. అయితే ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆమెకు ఈ మధ్య ఆఫర్స్ తగ్గాయి. యాంకర్ గా మాత్రం దున్నేస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి మొత్తం ఆమెదే. 

38

కాగా రష్మీ గౌతమ్ కి పాపులారిటీ తెచ్చిన అంశాలతో గ్లామర్ తో పాటు సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ కూడా ఒకటి. ఏళ్ల తరబడి వీరిద్దరూ బుల్లితెర లవ్ బర్డ్స్ గా ప్రచారం అయ్యారు. రష్మీ-సుధీర్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వీరిపై రూపొందించిన స్కిట్స్, రొమాంటిక్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. 

 

48

ఒకటి రెండు సార్లు వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. అయితే తాము నిజమైన ప్రేమికులం కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రేమికులుగా కనిపించామని రష్మీ, సుధీర్ అంటుంటారు. జనాలు మాత్రం ప్రేమ లేకుండా అంతలా ఇన్వాల్వ్ కావడం సాధ్యం కాదు. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని నమ్మేవాళ్ళు ఉన్నారు. 

58

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరం కాగా... ఈ జోడీని ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. జాతకాలు చూపించానని కమెడియన్ బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ ఈ కామెంట్స్ చేశాడు.

68

స్కిట్ చేయడానికి వేదిక మీదకు వచ్చిన బుల్లెట్ భాస్కర్... యాంకర్ రష్మీ వద్దకు వెళ్లి, మన బాబు(సుడిగాలి సుధీర్) బాగానే జీతాలు ఇస్తున్నట్లు ఉన్నాడు. నా వీడియోలు క్రింద కామెంట్స్ పెడుతున్నారు. ఒకడైతే 'ఏరా నీ డిక్కీ బలిసిందా?' అని కామెంట్ పెట్టాడు, అని రష్మీతో అన్నాడు. 

 

78

అనంతరం బుల్లెట్ భాస్కర్ పక్కన ఉన్న కమెడియన్ నాకు ఒక విషయంలో క్లారిటీ రావాలి, రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటారా? అని అడిగాడు. దానికి సమాధానంగా బుల్లెట్ భాస్కర్... ఖచ్చితంగా చేసుకుంటారు. జాతకాలు కూడా చూపించాను. రష్మీ అమెరికా అబ్బాయిని చేసుకుంటుంది. సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడు... అని అన్నాడు. దానితో అందరూ గట్టిగా నవ్వేశారు. 

 

 

88

బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా ఈ కామెంట్స్ చేసినా... రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రష్మీతో పాటు సుధీర్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు. వీరి మధ్య ఎఫైర్ రూమర్స్ కి ఇది కూడా కారణం. సడన్ గా పెళ్లి ప్రకటన చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved