ఇండియాలో కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇప్పుడంటే హీరోయిన్లు కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కాని.. ఒకప్పుడు హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. సినిమాలో క్యారెక్టర్ కు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఇక ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

గతంలో హీరోయిన్ కు సినిమాలో యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉండేది.. హీరోకు ఉన్న ఇంపార్టెన్స్ హీరోయిన్ కు ఉండేది. కథే అప్పటి సినిమాలకు హీరో అనుకోవచ్చు. కాని హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. హీరోయిన్ కు యాక్టింగ్ స్కోప్ తక్కువ. గ్లామర్ పార్ట్ కోసం, లేదా పాటల కోసం మాత్రమే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్లు ఉంటున్నారు. కాని రెమ్యునరేషన్ మాత్రం కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకంటే బయట సంపాదన ఎక్కువైపోయింది తారలకు.
అప్పట్లో హీరోయిన్లలో చాలా మందికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకోవాలనేది కలగా ఉండేది. హీరోలలో మెగాస్టార్, రజినీకాంత్, అమితాబ్, కమల్, లాంటి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్లు కూడా.. చాలా కాలం వరకూ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేకపోయారు. ఈ హీరోలకు కూడా కోటి తీసుకోవడానికి చాలా కాలం పట్టింది.
అదేవిధంగా భారతీయ సినిమా చరిత్రలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటి ఎవరో తెలుసా.. అతిలోక సుందరి శ్రీదేవి. అవును అప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉండగా.. ఆమె కోటి రికార్డ్ ను సాధించిందంటే.. నమ్ముతారా. కానీ ఇది నిజం. శ్రీదేవి పాన్ ఇండియా హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగు తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా ఆమె స్టార్ గా వెలుగు వెలిగింది.
ఆ సమయంలో శ్రీదేవికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి.. తమ సినిమాల్లో బుక్ చేసుకునేవారట. పోటీ పడి మరీ ఆమెతో సినిమాలు కచేసేవారట. దాంతో శ్రీదేవి బిజిగా ఉండటం చూసి.. ఓ హిందీ సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. ఆసినిమాకు ఆమె కోటి అందుకుంది. దీంతో భారతీయ సినిమా చరిత్రలో రూ.కోటి రెమ్యూనరేషన్ అందుకున్న తొలి నటిగా శ్రీదేవి రికార్డు సృష్టించింది.
అంత డిమాండ్ ఉంది కాబట్టే ఆమె మరణించే వరకూ అతిలోక సుందరిగానే ఉంది. ఇప్పటికి కోట్లాది మంది హృదయాలను ఆమె గెలుచుకుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆమె పేరు నిలబెడుతోంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించి.. ప్రస్తుతం సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది.