- Home
- Entertainment
- బిగ్ బాస్ అర్జున్ బుగ్గకి అందాల భామలు శ్రీ సత్య, వాసంతి ముద్దులు.. జెలసీతో తన బాధని బయటపెట్టిన మెహబూబ్
బిగ్ బాస్ అర్జున్ బుగ్గకి అందాల భామలు శ్రీ సత్య, వాసంతి ముద్దులు.. జెలసీతో తన బాధని బయటపెట్టిన మెహబూబ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాపులర్ కంటెస్టెంట్లలో శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, వాసంతి ప్రధానంగా చెప్పుకోవచ్చు. గ్లామర్ బ్యూటీస్‌గా వీరు అలరించారు. అంతేకాదు షోలో ఈ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపించారు.

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో అర్జున్ కళ్యాణ్ లవర్ బాయ్‌గా అలరించారు. అటు వాసంతితో, ఇటు శ్రీ సత్యలతో ఆయన పులిహోర కలిపాడు. సైలెంట్‌గా ఆయన తన లవ్ ట్రాక్‌లను నడిపించారు. షోలో ఎట్రాక్షన్‌గా నిలిచారు. మొదట వాసంతితో, ఆమె ఎలిమినేట్ అయ్యాక, శ్రీసత్యతో పులిహోర కలిపాడు అర్జున్. శ్రీసత్య కూడా చాలా వరకు క్లోజ్‌గానే మూవ్ అయ్యింది. కానీ వీరి బాండింగ్ బలపడుతున్న సమయంలోనే అనూహ్యంగా అర్జున్ ఎలిమినేట్ అయ్యారు.
కానీ వాసంతి, శ్రీసత్యలతో బాగానే క్లోజ్‌గా మూవ్ అయ్యాడు అర్జున్ కళ్యాణ్. వారితో లవ్ ట్రాక్‌ని పట్టాలెక్కించాలనుకున్నాడు. హైలైట్‌గా నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే ఎలిమినేషన్‌తో దూరమయ్యారు. కానీ ఆ గ్యాప్, ఆ బాధ ఇప్పుడు తీరింది. ఇప్పుడు ఈ ఇద్దరు తనకు కనెక్ట్ అవడం విశేషం. తాజాగా ఓంకార్ షోలో శ్రీసత్య, వాసంతి, మెహబూబ్‌లతో కలిసి సిక్త్స్ సెన్స్ సీజన్ 5లోకి గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య జంటలుగా హాజరయ్యారు.
వీరితో ఓంకార్ ఆడుకున్నారు. తికమక పెట్టి కన్‌ఫ్యూజ్ చేసి, ఉత్కంఠకి గురి చేసి కాసేపు ఎంటర్‌టైన్ చేశారు. ఇంతలో అర్జున్‌పైకి గన్ ఎక్కుపెట్టింది శ్రీ సత్య, ఇది ఆద్యంతం ఉత్కంఠతకి గురి చేసింది. అనంతరం రెండు జంటలుగా ఏర్పడి డాన్సులు చేశారు. అంతే అనూహ్యంగా వాసంతి వచ్చి అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ వెంటనే శ్రీ సత్య కూడా తానేం తక్కువ కాదని, మరో బుగ్గపై ముద్దు పెట్టడం విశేషం. ఇలా ఇద్దరు భామలు పోటీ పడి ముద్దులు పెట్టడంతో అర్జున్ పండగ చేసుకున్నాడు. ఆ తన్మయత్వం చెందారు.
దీనికి శ్రీ సత్య స్పందిస్తూ, ఏమైనా చేయోచ్చు కదా, ఇంకేం లేవా? అని అడగ్గా.. పక్కన మెహబూబ్ ఇంకేటమ్మా..ఇంకే చేస్తారమ్మా.. నాకేం లేవా అంటూ అడగడం నవ్వులు పూయించింది. హైలైట్‌గా నిలిచింది. ఇది ఈ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ కామెంట్లు పెడుతున్నారు.
అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్6 నుంచి ట్రై చేస్తే ఇప్పటికి వర్కౌట్ అయ్యిందని, బిగ్ బాస్‌లో ఈ ఇద్దరిని పడేయడానికి ట్రై చేస్తే ఇప్పటికీ పడిపోయారనే కోణంలో కామెంట్లు పెడుతున్నారు. వాసంతి, అర్జున్ జోడీ సూపర్ అని లవ్ ఎమోజీలను పంచుకుంటున్నారు. ఆ ముద్దు సీన్ మాత్రం కేక్ అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కూడా మరో భాగంలో పాల్గొన్నారు.