MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • కోపరేట్‌ చేస్తావా అన్నాడు.. అవినాష్‌పై శ్రీముఖి సంచలన ఆరోపణలు.. స్టార్‌ డైరెక్టర్‌ ముందు గోడు

కోపరేట్‌ చేస్తావా అన్నాడు.. అవినాష్‌పై శ్రీముఖి సంచలన ఆరోపణలు.. స్టార్‌ డైరెక్టర్‌ ముందు గోడు

యాంకర్‌ శ్రీముఖి, కమెడియన్‌ ముక్కు అవినాష్‌ మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ అనూహ్యంగా శ్రీముఖి సంచలన ఆరోపణలు చేయడం షాకిస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 30 2023, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీముఖి తనని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుందని అవినాష్‌ ఓ సందర్భంలో తెలిపారు. జబర్దస్త్ వదిలి, బిగ్‌ బాస్‌ కి వెళ్లాక జరిగిన పరిణామాల సమయంలో శ్రీముఖి తనకు అండగా ఉందని ఆ మధ్యచెప్పుకొచ్చాడు అవినాష్‌. శ్రీముఖి ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు. ఇద్దరు కలిసి రీల్స్ కూడా చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కలిసే `ఆదివారం స్టార్‌ మా పరివార్‌` షో చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇందులో అక్క, తమ్ముడిలానే కలిసిపోతుంటారు. కలిసి జోకులేసుకుంటారు. నవ్వులు పూయిస్తుంటారు. ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఏమైనా చేస్తారు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్‌కి మంచి పేరు ఉంది. శ్రీముఖి కూడా అవినాష్‌ పంచ్‌లను అంతే స్పోర్టీవ్‌గా తీసుకుంటుంది. అలా కలిసి షోస్‌ చేస్తూ కామెడీని పంచుతున్నారు. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. కానీ తాజాగా శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 
 

36

ముక్కు అవినాష్‌పై శ్రీముఖి సంచలన ఆరోపణలు చేసింది. తనని `ఇది కార్పోరేట్‌ షోకాదు.. కోపరేట్‌ చేస్తావా` అని అడిగినట్టు ఆరోపించింది. అంతటితో ఆగలేదు.. ఆమే ఏకంగా స్టార్‌డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడికి చెప్పింది. తనని ఇలా అంటున్నాడని ఆయన ముందు గోడు వెళ్లబోసుకుంది. ఇదే ఓ ఎత్తైతే.. అది ఒక షోలో కావడం గమనార్హం. దీంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
 

46

దీనికి స్పందించిన అవినాష్‌.. తీవ్రంగా ఖండిస్తాడని, తనకే పాపం తెలియదని అంటాడని భావించారు. కానీ అలా అనలేదు. అమ్మతోడు సార్‌ చెబుతున్నా, తాను అలానే అన్నట్టు ఒప్పుకోవడం విశేషం. ఇదే ట్విస్ట్ ఇప్పుడు మరింత రక్తికట్టిస్తుంది. ఇది హైలైట్‌గా నిలిచింది. మరి ఇదంతా ఓ షో కోసం కావడం విశేషం. షోలో భాగంగా కామెడీ చేస్తూ ఇలా అవినాష్‌పై శ్రీముఖి ఆరోపణలు చేయడం, అనిల్‌ రావిపూడికి చెప్పడం, దీనికి అవినాష్‌ సైతం ఒప్పుకోవడం ఆకట్టుకుంటుంది. 

56

అనిల్‌ రావిపూడి జడ్జ్ గా `ఆహా`లో కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌` షో కొత్తగా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీముఖి.. అవినాష్‌పై ఆరోపణలు చేసింది. ఇదంతా చాలా ఫన్నీగా సాగింది. ప్రోమోలో ఇంకా అవినాష్‌ విభిన్న రకాలుగా కామెడీ చేసి నవ్వులు పూయించారు. ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. 
 

66
Sreemukhi

Sreemukhi

ఇంతకు ముందే ఇదే పేరుతో ఓ సీజన్‌ అయిపోయింది. దానికి సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి యాంకర్లుగా చేశారు. ఇప్పుడు వారి స్థానంలో శ్రీముఖి వచ్చి చేరింది. ఆమె మూడు నాలుగు షోస్‌తో బిజీగా ఉంది. ఈ షో కూడా ఆమె ఖాతాలో చేరింది. తనదైన యాంకరింగ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ ప్రోమోలో రెడ్‌ డ్రెస్‌లో కత్తిలాగ ఉంది శ్రీముఖి. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved