- Home
- Entertainment
- షోలో అందరి ముందు శేఖర్ మాస్టర్‌కి శ్రీముఖి ముద్దులు.. క్లారిటీ ఇచ్చిన డాన్స్ మాస్టర్..
షోలో అందరి ముందు శేఖర్ మాస్టర్‌కి శ్రీముఖి ముద్దులు.. క్లారిటీ ఇచ్చిన డాన్స్ మాస్టర్..
షోలో అందరి ముందు యాంకర్ శ్రీముఖి రెచ్చిపోయి శేఖర్ మాస్టర్ కి ముద్దులు పెట్టింది. అది హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు శేఖర్ మాస్టర్.

టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న శేఖర్ మాస్టర్. ఇప్పుడు స్టార్ హీరోలకు ఆయనే ఫస్ట్ ఛాయిస్. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడలోనూ కొరియోగ్రఫీ చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఆఫర్లని అందుకుంటున్నాడు. ఫుల్ బిజీగా ఉంటూ డాన్స్ షోలోనూ మెప్పిస్తున్నారు. `ఢీ` షోకి కూడా తను జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ ప్రణతితో కలిసి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే శేఖర్ మాస్టర్ కేవలం జడ్జ్ గానే కాదు, అడపాదడపా స్కిట్లు కూడా వేస్తుంటారు. కొన్నాళ్లపాటు `జబర్దస్త్` లో స్కిట్లు వేశారు. ఆ తర్వాత కామెడీ స్టార్స్ అనే షోలోనూ స్కిట్లు ప్రదర్శించారు. పైగా దానికి జడ్జ్ గా కూడా ఉన్నారు. హైపర్ ఆదితో కలిసి చేసిన స్కిట్లు మంచి ఆదరణ పొందాయి. నవ్వులు పూయించాయి. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ పై ఓ రూమర్ క్రియేట్ అయ్యిందట. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందనే ప్రచారంస్టార్ట్ చేశారట.
అయితే ఈ క్రమంలో ఓంకార్ నిర్వహించే సిక్త్స్ సెన్స్ షోలో శేఖర్ మాస్టర్, శ్రీముఖి పాల్గొన్నారు. ఇందులో స్టేజ్‌పైనే ఓంకార్ ముందు రెచ్చిపోయింది శ్రీముఖి. ఉమ్మా ఉమ్మా.. అంటూ శేఖర్ మాస్టర్‌కి ముద్దు పెట్టింది. అప్పట్లో అది పెద్ద సెన్సేషనల్ అయ్యింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ వైఫ్ శిరీషకి కూడా వివరణ ఇచ్చారు. కేవలం స్కిట్లో భాగంగా చేశామని, నిజమైన ముద్దు కాదని తెలిపారు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అది బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాని ఊపేసింది. తాజాగా దీనిపై శేఖర్ మాస్టర్ వివరణ ఇచ్చాడు. అంజి టాక్స్ లో పాల్గొన్న ఆయన ఈ ముద్దు సీన్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అమ్మాయిల ఫాలోయింగ్‌కి, శ్రీముఖి ముద్దులకు ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో శేఖర్ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు.
`ఢీ` షోగానీ, జబర్దస్త్ లోనూ, కామెడీ స్టార్స్ లోగానీ డాన్సులు చేస్తుంటే బాగా అరిచే వాళ్లట. అనసూయ, రష్మి, వంటి వారితో ఏదైనా మాట్లాడుతుంటే, వాళ్లతో కలిసి డాన్సు చేస్తుంటే గోల పెట్టేవాళ్లట. ఏదో తనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని, పడి చస్తారనేలా క్రియేట్ చేశారట. అది షోలో కమెడియన్లు క్రియేట్ చేసిన రూమర్ అని చెప్పాడు. సీన్ రక్తికట్టించడం కోసం చేసిందన్నారు.
ఇక ముద్దు సీన్ గురించి చెబుతూ, ఓంకార్ షోలో తన సెన్స్ ని టెస్ట్ చేసే క్రమంలో శ్రీముఖి ఊరికే అలా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దు పెట్టినట్టు చేసిందని అది ఆమె జస్ట్ సరదాగా చేసిందన్నారు. ఆమె చేసిందానికి నేనేం చేస్తా, దానికి ఏదేదో అల్లుకుంటున్నారు. కానీ అది జస్ట్ ఫన్ కోసం చేసిందే అని తెలిపారు శేఖర్ మాస్టర్. అయితే ఆ తర్వాత కామెడీ స్టార్స్ లో ఓసారి ఇదే ప్రస్తావన వస్తే.. ఆ రోజు ఇంటికెళ్లాక తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని శేఖర్ మాస్టర్ చెప్పడం విశేషం.