- Home
- Entertainment
- శ్రీముఖి హీరోయిన్‌గా ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా? రిలీజ్ అయితే రాములమ్మ హీరోయిన్‌గా సెటిల్ అయ్యేదేమో
శ్రీముఖి హీరోయిన్‌గా ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా? రిలీజ్ అయితే రాములమ్మ హీరోయిన్‌గా సెటిల్ అయ్యేదేమో
యాంకర్ శ్రీముఖి నటిగానూ పలు సినిమాలు చేసింది. హీరోయిన్‌గానూ మెరిసింది. అయితే ఆమె హీరోయిన్‌గా నటించిన ఓ మూవీ విడుదలకు నోచుకోలేదు. ఆ మూవీ ఏంటి? అనేది చూస్తే

స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి
శ్రీముఖి ఇప్పుడు స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె చేతిలో నాలుగైదు షోస్ ఉన్నాయి. తనదైన యాంకరింగ్‌తో బుల్లితెరపై రచ్చ చేస్తోంది శ్రీముఖి. ఒకప్పుడు సుమ టాప్ యాంకర్‌గా రాణించేంది. కానీ ఆమెని దెబ్బకొట్టి ఇప్పుడు శ్రీముఖి టాప్‌లో ఉండటం విశేషం. అయితే శ్రీముఖి యాంకరింగ్ కోసం ఇండస్ట్రీలోకి రాలేదు. నటిగా నిరూపించుకోవాలని వచ్చింది. కానీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని బుల్లితెరని శాసిస్తుంది.
KNOW
`జులాయి`తో ఇండస్ట్రీలోకి శ్రీముఖి ఎంట్రీ
శ్రీముఖి `జులాయి` సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఇందులో హీరోకి సిస్టర్‌గా నటించింది. ఆమెది కాస్త ఫన్నీ రోల్. ఆ తర్వాత `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిపోయింది. `ప్రేమ ఇష్క్ కాదల్` చిత్రంలో ఓ లీడ్ పెయిర్‌గా కనిపించింది శ్రీముఖి. కాస్త గుర్తింపు తెచ్చిన పాత్ర ఇది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ నోటెడ్ కాలేకపోయింది.
శ్రీముఖి నటించిన సినిమాలివే
ఇలా వరుసగా `చంద్రిక`, `ధనలక్ష్మి తలుపు తడితే`, `ఆంధ్రాపోరి`, `నేను శైలజ`, `సావిత్రి`, `జెంటిల్ మేన్`, `మనలో ఒకడు`, `బాబు బాగా బిజీ`, `క్రేజీ అంకుల్స్`, `మ్యాస్ట్రో`, `భోళా శంకర్` వంటి చిత్రాలు చేసింది. `క్రేజీ అంకుల్స్` లోనూ శ్రీముఖిది హీరోయిన్ పాత్రనే. కాకపోతే ఇందులో ఆమె రోల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆమె వెంట అంకుల్స్ పడటం ఇందులో క్రేజీ విషయం. కథ చాలా ఫన్నీగా ఉన్నా, ఆ ఫన్ వెండితెరపై వర్కౌట్ కాలేదు. ఈ మూవీ ఆడలేదు.
శ్రీముఖి హీరోయిన్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ
అయితే వీటితోపాటు మరో సినిమాలో శ్రీముఖి హీరోయిన్‌గా నటించింది. అదే `గుడ్ బ్యాడ్ అగ్లీ`. నటుడు హర్శవర్థన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీముఖి హీరోయిన్‌గా నటించగా, మురళీ కృష్ణ హీరోగా నటించాడు. కిశోర్, హర్శవర్థన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బోగాది అంజిరెడ్డి నిర్మాత. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్‌కి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ కూడా చేశారు. వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహించారు. కానీ అనూహ్యంగా సినిమా ఆగిపోయింది. విడుదలకు నోచుకోలేదు. ఆర్థిక ఇబ్బందులతో రిలీజ్‌కి నోచుకోలేదని సమాచారం.
శ్రీముఖికి లైఫ్ ఇవ్వాల్సిన మూవీ ఆగిపోయింది
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు హర్శవర్థన్. తనే సంగీతం కూడా అందించారు. మంచి మ్యూజిక్ ఫిల్మ్ గా దీన్ని రూపొందించారు. కానీ రిలీజ్ చేయించలేకపోయారు. ఇందులో శ్రీముఖి మురళీ కృష్ణకి లవర్‌గా నటించింది. చాలా బలమైన పాత్ర ఆమెది. రిలీజ్ అయితే మంచి పేరొచ్చేది. కానీ విడుదల కాకపోవడంతో శ్రీముఖి టాలెంట్ బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. శ్రీముఖి చివరగా చిరంజీవితో `భోళా శంకర్`లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో `ఖుషి` ఎపిసోడ్‌ని రీక్రియేట్ చేశారు. చిరు, శ్రీముఖి మధ్య నడుము సీన్ అదిరిపోయింది.