లెహంగా ఓణీలో కుర్రాళ్లకి కిక్కిస్తున్న శ్రీలీల అందాలు.. `భగవంత్ కేసరి` ఈవెంట్‌లో క్రేజీ బ్యూటీ రచ్చ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరు ఎదురు చూస్తున్నారు, అందరు కోరుకుంటున్న హీరోయిన్ శ్రీలీల. ఒక్క సినిమాతోనే సంచలనంగా మారిందీ కుర్ర బ్యూటీ.
శ్రీలీల(Sreeleela) టాలీవుడ్‌కి పట్టిన ఫీవర్‌లా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. పవన్ కళ్యాణ్, మహేష్‌బాబుల నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరు ఈ బ్యూటీనే కోరుకుంటున్నారు. ఆమెతో రొమాన్స్ కి సిద్ధమవుతున్నారు. ఏకంగా బాలయ్య సైతం తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఆమెని తీసుకోవాలనుకోవడం చూస్తుంటనే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతగా టాలీవుడ్ లో సెన్సేషన్‌గా, హాట్ టాపిక్‌గా మారిందీ అందాల భామ. ప్రస్తుతం పది సినిమాలతో టాలీవుడ్‌ని ఊపేస్తుంది. అందులో ఒకటి `భగవంత్ కేసరి`. బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కాజల్ హీరోయిన్‌గా చేయగా, శ్రీలీల బాలయ్యకి అన్న కూతురు పాత్రలో నటిస్తుంది.
`భగవంత్ కేసరి` ట్రైలర్ ఈవెంట్ తాజాగా వరంగల్‌లో జరిగింది. ఇందులో శ్రీలీల స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఆమె లెహంగా ఓనీలో మెరిసింది. బ్లూ లెహంగా, రెడ్ ఓనీ వేసుకుని ఈవెంట్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. చిలిపి నవ్వులు, అల్లరి పనులతో సందడి చేసింది.
బాలయ్యతోపాటు ఈవెంట్‌కి వచ్చింది శ్రీలీల. ఆయనతోపాటే ఉంటూ అందరి చూపులు తన వైపు తిప్పుకుంది. పక్కన కాజల్ ఉన్నా ఈ బ్యూటీ సందడి నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. కుర్రాళ్ల చూపంతా ఈ బ్యూటీ వైపే ఉండటం విశేషం.
అయితే ఇందులో హాఫ్ శారీలో పల్లెటూరి పిల్లని తలపిస్తుంది శ్రీలీల. మన పక్కింటి అమ్మాయిలా ముస్తాబై హోయలు పోయింది. సోకులన్నీ ఆరబోస్తూ కుర్రాళ్లకి కిక్కించింది. ఈవెంట్‌లో రచ్చ రచ్చ చేసింది.
శ్రీలీల ఇందులో బాలకృష్ణకి అన్న కూతురుగా కనిపిస్తుంది. ఆయన్ని ఆమె చిచ్చా అంటూ పిలవడం విశేషం. అయితే కథమొత్తం ఈ బ్యూటీ చుట్టే తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
శ్రీలీలని ఆర్మీకి పంపించాలనుకుంటాడు బాలకృష్ణ. ఆమెని అందుకోసం సన్నద్దం చేయిస్తుంటాడు. కఠినమైన వ్యాయామాలు చేయిస్తూ కష్టపడుతుంటాడు. ఆమెకి ఇష్టం లేకపోయినా చేయాలని చెబుతుండటంలో శ్రీలీల మనసులో విసుక్కుంటుంది.
అయితే తనని ఎందుకు ఆర్మీలో జాయిన్ చేయించాలనుకుంటాడనేది ఇందులో సస్పెన్స్ గా ఉంచారు. విలన్లు ఆమెని ఎందుకు తీసుకెళ్లారు. వారిని కాపాడేందుకు బాలయ్య రావడం వంటి సీన్లు కనిపించాయి.
చూడ్డానికి ఈ సినిమా స్టోరీ రొటీన్‌గానే ఉండబోతుందని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో అంతా క్లారిటీ ఉండనుంది. అయితే అది రొటీన్‌గానేఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ గత చిత్రాల రేంజ్‌లో లేకపోవడం అంతగా కిక్ ఇవ్వడం లేదు.
ఇక శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తుంది. బాలయ్యతోపాటు పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్ భగత్‌సింగ్`, మహేష్‌తో `గుంటూరు కారం`, నితిన్‌తో `ఎక్ట్సా ఆర్డినరీ మ్యాన్`, వైష్ణవ్ తేజ్‌తో `ఆదికేశవ` చిత్రాలు చేస్తుంది.
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి చిత్రం నుంచి తప్పుకుందట. ఇటీవల `స్కంద` మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. అలాగే కొత్తగా రవితేజతో ఓ సినిమా ఫైనల్ అయ్యిందట. ఇలా ఫుల్ బిజీగా ఉందీ ఈ కుర్ర భామ.