భగవంత్ కేసరి సినిమా చెయ్యొద్దని సలహా ఇచ్చారు.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు
భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ కోలాహలం మధ్య పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య బాబు కూతురిగా నటించింది. అయితే ఆమె తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.
భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకూ పాజిటీవ్ రివ్యూను సాధించింది. కలెక్షన్ల పరంగా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి. ఈసినిమాలో బాలయ్య కొత్తగా కానిపించడం.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అయితే మరో విశేషం ఏంటంటే.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అవ్వడానికి అడుగు దూరంలో ఉన్న శ్రీలీల ఈమూవీలో బాలయ్య కూతురుగా నటించడం.
Unstoppable
బాలయ్య బాబుకు కూతురుగా శ్రీలీల నటించానికి ఒప్పుకోవడం ఒకింత ఆడియన్స్ కు ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఈ పాత్ర గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది. ఈ షోకి ఫస్ట్ గెస్ట్ లు గా భగవంత్ కేసరి టీమ్ నే పిలిచాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడితో పాటు. కాజల్, శ్రీలీల సందడి చేశారు.
అయితే ఈ సందర్భంగానే శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈసినిమాలో తనను నటించవద్దంటూ చాలా మంది సలహా ఇచ్చారంటూ పెద్ద బాంబ్ పేల్చేసింది హీరోయిన్. ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. శ్రీలీల సమాధానం చెబుతూ నేను నటించిన పెళ్లి సందడి సినిమా సమయంలోనే నాకు ఈ సినిమా కథ వినిపించారు. అప్పటికే నాకు హీరోయిన్గా చాలా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.
అలాంటి సమయంలో కూతురి పాత్ర అంటే చాలామంది ఈ సినిమాని ఒప్పుకోవద్దు నో చెప్పు అంటూ నాకు సలహా ఇచ్చారు. కూతురు పాత్ర చేశావో.. హీరోయిన్ గా నీ కెరీయర్ దెబ్బతింటుందని అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేయమని చాలా మంది చెప్పారు. అంటు అసలు విషయం వెళ్ళడించింది శ్రీలీల.
అయితే హీరోయిన్ గా నేను ఎన్ని సినిమాలైనా చేయవచ్చు కానీ ఇలా కూతురి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేదు.అందుకే వచ్చిన అవకాశాం వదలుకోవద్దు.. అందులోను బాలయ్య కూతురుగా అవకాశం వచ్చినప్పుడే ఇలాంటివి సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ సినిమాకు కమిట్ అయ్యానని శ్రీలీల తెలిపారు.
అంతే కాదు ఆమె మరో మాటతో ఓ మెట్టు ఏక్కేశారు.. నేను కెరియర్ పరంగా తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఈ సినిమాకు కమిట్ అవ్వడమే అంటూ శ్రీ లీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీలీల మాటలకు అటు బాలయ్యతో పాటు.. ఇటు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. అటు నందమూరి ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు.