చిన్న చిన్న అభ్యర్థనలను మన్నించాలి.. బాలు రాసిన లేఖ వైరల్
బాలు స్వయంగా రాసిన లేఖ ఒకటి వైరల్ అవుతుంది. నవంబర్ 30న ఆ కార్యక్రమం జరుగనుండగా, అందుకు చాలా టైమ్ ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలనని రాశారు.
బాలు మరణంతో సంగీతం ప్రపంచం మూగబోయింది. పాట ఒంటరైపోయింది. సంగీత చిన్నబోయింది. వీణ మొగనంది. అసలు సంగీతమే నిశ్టేష్టురాలైంది. పాటల రచయితల కలం కదలడం లేదు.
నేటితరం గాయకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువు లేని పాట ఒంటరైపోయిందని బోరున విలపిస్తున్నారు. తమకు తండ్రిని, ఓ పెద్ద దిక్కుని కోల్పోయిన భావన కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు.
ఈ తరుణంలో బాల రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తాను నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదు. దయజే నా పేరు ముందు `డాక్టర్`, `పద్మభూషణ్`, `గాన గంధర్వ` లాంటి విశేషణలు వేయకండ`ని విన్నవించారు.
నవంబర్ 30న ఆ కార్యక్రమం జరుగనుండగా, అందుకు చాలా టైమ్ ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలనని రాశారు. బాలు ఈ లేఖని స్వయంగా రాయడంతో ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఆయన అంత్యక్రియలు చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ సమీపంలోని తామరైపాక్కంలోని ఫామ్‌హౌస్‌లో నేడు(శనివారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనుంది.