- Home
- Entertainment
- తమన్నా లాగా లవ్ అఫైర్స్ తో ఊహించని షాక్ ఇచ్చిన హీరోయిన్లు.. కీర్తి సురేష్ గురించి కూడా రూమర్లు..
తమన్నా లాగా లవ్ అఫైర్స్ తో ఊహించని షాక్ ఇచ్చిన హీరోయిన్లు.. కీర్తి సురేష్ గురించి కూడా రూమర్లు..
చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన రూమర్స్ వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేమ కథలు నిజమై పెళ్లి వరకు వెళుతుంటాయి. మరికొన్నింటికి మధ్యలో ఫుల్ స్టాప్ పడుతూ ఉంటుంది. అయితే కొందరు హీరోయిన్లు ఎవరూ ఊహించని వ్యక్తులతో ప్రేమలో పడ్డప్పుడు అభిమానులకు కాస్త షాకింగ్ గానే ఉంటుంది.

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన రూమర్స్ వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేమ కథలు నిజమై పెళ్లి వరకు వెళుతుంటాయి. మరికొన్నింటికి మధ్యలో ఫుల్ స్టాప్ పడుతూ ఉంటుంది. అయితే కొందరు హీరోయిన్లు ఎవరూ ఊహించని వ్యక్తులతో ప్రేమలో పడ్డప్పుడు అభిమానులకు కాస్త షాకింగ్ గానే ఉంటుంది. అలాంటి రూమర్స్ వచ్చిన ప్రేమ కథల గురించి ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న షాకింగ్ లవ్ అఫైర్ ఎవరిది అంటే ముందుగా చెప్పుకోవాల్సింది.. మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి. మలైకా అరోరా దాదాపు ఐదు పదుల వయసుకు సమీపిస్తోంది. ఈ ముదురు హాట్ బ్యూటీతో 12 ఏళ్ళు వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ ప్రేమని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అంతగా పాపులర్ కానీ ఓ యువ నటితో దాదాపుగా ఐదు పదుల వయసు ఉన్న హృతిక్ డేటింగ్ చేస్తున్నాడు. ఆమె పేరు సబా ఆజాద్.
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన గురించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి లవ్ అఫైర్ ఊహించనిది అయితే కాదు. కానీ ప్రస్తుతం వీరిద్దరూ బాగా ట్రెండ్ అవుతున్నారు. మాల్దీవుల్లో రష్మిక, విజయ్ దేవరకొండ ఘాటు ప్రేమని ఎంజాయ్ చేస్తున్నారు. తమ రిలేషన్ ని ఎంత సీక్రెట్ గా ఉంచాలని ప్రయత్నించినా ఏదో ఒక చోట ఈ జంట దొరికిపోతున్నారు.
ఎలాంటి వివాదాలకు చోటివ్వని అందాల నటి కీర్తి సురేష్ గురించి కూడా డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఎనెర్జిటిక్ అండ్ సెన్సేషనల్ మ్యుజీషియన్ అనిరుద్ రవిచందర్ తో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్యన రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రిలేషన్ షిప్ ఎక్కువరోజులు కొనసాగినట్లు లేదు.
సొట్టబుగ్గల సుందరి తాప్సి కూడా ప్రేమని ఆస్వాదిస్తోంది. డెన్మార్క్ కి చెందిన బ్యాట్మింటన్ ఆటగాడు మథియాస్ తో తాప్సి ప్రేమలో ఉంది. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
శృతి హాసన్ ఈ రకమైన షాకులు ఇవ్వడం కొత్తేమి కాదు. అసలు చిత్ర పరిశ్రమతో ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులతో ఆమె డేటింగ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ శాంతను అనే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది.
ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా ఊహించని షాక్ ఇచ్చింది. తమన్నా ఎంతటి గ్లామర్ బ్యూటీనో అందరికి తెలుసు. కానీ ఆమె డేటింగ్ చేస్తున్నది మాత్రం.. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన విజయ్ వర్మతో. దీనితో తమన్నా ఏంటి.. అతడితో డేటింగ్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. కానీ లవ్ అనేది తమన్నా పర్సనల్ ఛాయిస్.