ఈ సినిమాల వల్ల హీరో, హీరోయిన్లకు ఒరిగిందేమీ లేదు!

First Published 29, May 2019, 7:34 PM IST

సౌత్ హీరోలు, హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి సక్సెస్ అయిన నటులు చాలా తక్కువ. ఎవరో శ్రీదేవి లాంటి నటులు మాత్రమే బాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అనవసరంగా బాలీవుడ్ లో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న నటీనటులు వీళ్ళే. 

రాంచరణ్: ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. జంజీర్ తర్వాత చరణ్ మరోమారు బాలీవుడ్ జోలికి వెళ్ళలేదు.

నితిన్ : యంగ్ హీరో నితిన్ బాలీవుడ్ లో నటించిన చిత్రం అగ్యాత్. ఈ థ్రిల్లర్ మూవీ రాంగోపాల్ వర్మ దర్శత్వంలో తెరకెక్కింది. నితిన్ వరుస పరాజయాల్లో ఉన్న సమయంలో అగ్యాత్ చిత్రం మరో ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.

రానా దగ్గుబాటి: రానా నటించిన డిపార్ట్ మెంట్ చిత్రానికి కూడా రామ్ గోపాల్ వర్మనే దర్శకుడు. ఈ చిత్రంలో అమితాబ్, సంజయ్ దత్, రానా కలసి నటించారు. ఈ చిత్రం బాలీవుడ్ లో రానాకు ఏవిధంగానూ ఉపయోగపడలేదు. కానీ ప్రస్తుతం రానాకు బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో మంచి మార్కెట్ ఉంది.

కాజల్ :అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని హీరోయిన్. అందులో సందేహం లేదు. కానీ బాలీవుడ్ లో క్రేజ్ మాత్రం కాజల్ కు ఇప్పటికి అందని ద్రాక్షనే. 'దో లాఫ్జాన్ కి కహాని' కంటే ముందు కాజల్ బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు నిరాశపరిచినా మంచి ప్రయత్నాలుగా నిలిచాయి. కానీ ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో నెం 1గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ లో ది జెంటిల్మెన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

వెంకటేష్: విక్టరీ వెంకటేష్ కు కూడా బాలీవుడ్ లో నిరాశే ఎదురైంది. వెంకీ, రవీనాటాండన్ తఖ్దీర్ వాలా చిత్రంలో జంటగా నటించారు. బాలీవుడ్ లో ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

నాగార్జున : అక్షయ్ కుమార్, నాగార్జున, సోనాలి బింద్రే అంగారే చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. నాగార్జున కూడా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయాడు. అంగారే చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

అసిన్: ఖిలాడీ 786 చిత్రంలో అసిన్, అక్షయ్ కుమార్ జంటగా నటించారు. అసిన్ సౌత్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ అసిన్ కు పెద్దగా కలసిరాలేదనే చెప్పాలి. ఆమెకు గజినీ చిత్రం మాత్రమే బాలీవుడ్ లో మెమొరబుల్ మూవీగా నిలిచింది.

తమన్నా: అజయ్ దేవగన్, తమన్నా హిమ్మత్ వాలా చిత్రంలో జంటగా నటించారు. తమన్నా అందాలు ఆరబోసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. హిమ్మత్ వాలా చిత్రం నిరాశపరిచింది.

ఇలియానా : సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా పేరు ప్రథమంగా పేర్కొనొచ్చు. టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. సైఫ్ అలీఖాన్ సరసన నటించిన హ్యాపీ ఎండింగ్ చిత్రంపై ఇలియానా భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు.

త్రిష : బాలీవుడ్ లో హీరోయిన్ ప్రయత్నించి భంగపడ్డ వారి జాబితాలో త్రిష కూడా ఉంది. త్రిష నటించిన కట్టా మీఠా చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

శృతి హాసన్ : శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ లోనే ప్రయత్నాలు చేసింది. శృతి హాసన్ బాలీవుడ్ లో నటించిన కొన్ని చెత్త చిత్రాల్లో రాఖీ హ్యాండ్సమ్ కూడా ఒకటి.

loader