సౌందర్య ప్రేమించింది ఎవరిని ? ఆ హీరోతో రిలేషన్ పై దారుణమైన పుకార్లు
వెండితెరపై చెరగని ముద్ర వేసి పిన్న వయసులోనే కనుమరుగైన సౌందర్యని అభిమానులు ఎవరూ మరచిపోలేరు. చిత్ర పరిశ్రమలో సౌందర్య ఒక ప్రత్యేకమైన నటి అని చెప్పాల్సిందే.
వెండితెరపై చెరగని ముద్ర వేసి పిన్న వయసులోనే కనుమరుగైన సౌందర్యని అభిమానులు ఎవరూ మరచిపోలేరు. చిత్ర పరిశ్రమలో సౌందర్య ఒక ప్రత్యేకమైన నటి అని చెప్పాల్సిందే. 2004లో సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య ఆమె మరణించే వరకు కూడా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఉన్నారు.
సినిమాలో అందంగా కనిపించడం అవసరం అంతే తప్ప హద్దులు మీరేలా గ్లామర్ షో అవసరం లేదని నిరూపించిన నటి సౌందర్య. తన సాటి నటీమణులు రమ్య కృష్ణ,రంభ, నగ్మ, రోజా, ఆమని లాంటివారు గ్లామర్ లో దూసుకుపోతున్న తరుణంలో ఏమాత్రం అందం హద్దులు దాటకుండా స్టార్ హీరోయిన్ గా నిలబడింది సౌందర్య మాత్రమే అని చెప్పాలి.
నేడు సౌందర్య జయంతి. ఈ సందర్భంగా సౌందర్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటి వెన్నిరా ఆడై నిర్మల ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సౌందర్య, వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ జయం మనదేరా షూటింగ్ కొంతభాగం స్విట్జర్లాండ్ లో జరిగింది. ఆ చిత్రంలో ఆడై నిర్మల కూడా కీలక పాత్రలో నటించారు.
ఆ మూవీ షూటింగ్ సమయంలో తాను సౌందర్యకి బాగా క్లోజ్ అయ్యాయని ఆమె అన్నారు. సౌందర్యని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని, ఆమె మరణం ఇప్పటికి దిగ్బ్రాంతి కరమే అని నిర్మల తెలిపారు. అయితే ఆ చిత్ర షూటింగ్ సమయంలో సౌందర్య ఎవరినో ప్రేమిస్తున్నట్లు తనకి అర్థం అయిందని నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఆ ప్రేమ వ్యవహారం గురించి సౌందర్య నిర్మలతో షేర్ చేసుకున్నారట కూడా.
సౌందర్య ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకునేదట. నటిగానే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కలలు కనింది. అయితే సౌందర్య ఎవరిని ప్రేమించింది ఆ వ్యక్తి ఎవరు ? అనే విషయాన్ని నిర్మల రివీల్ చేయలేదు. అయితే చివరకి సౌందర్య ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు అని తెలుస్తోంది. ఆమె 2003లో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చిత్ర పరిశ్రమలో పుకార్లకు సౌందర్య కూడా అతీతం కాదు. సౌందర్య, జగపతి బాబు ప్రియరాగాలు, దొంగాట లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో జగపతి బాబు, సౌందర్య మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ప్రచారమే జరిగింది.
దీనిపై జగపతి బాబు మాట్లాడుతూ..ప్రియరాగాలు మూవీ టైంలో కోందండ రామిరెడ్డి గారు రైల్వే స్టేషన్ లో దిగారని తెలిస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. అదే ట్రైన్ కి సౌందర్య వస్తోందని నాకు అసలు తెలియదు. కానీ జగపతి బాబు సౌందర్య కోసమే వెళ్ళాడు.. రైల్వేస్టేషన్ నుంచి ఇద్దరూ ఎక్కడికో వెళ్లారు అంటూ దారుణమైన రూమర్స్ క్రియేట్ చేసారని జగపతి బాబు అన్నారు. సౌందర్య వస్తున్న విషయమే నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది. నా కోస్టార్ కాబట్టి మాట్లాడా. దాని గురించి కూడా పెడర్థాలు తీశారు అని జగపతి బాబు అన్నారు.
సౌందర్య అప్పట్లో టాప్ హీరోయిన్ కాబట్టి వందల కోట్ల ఆస్తులు సంపాదించింది అని టాక్. సౌందర్య కర్ణాటకలో మెడికల్ కాలేజీ స్థాపించారు. స్కూల్స్ ని కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేస్తున్నారు. బెంగుళూరులో సౌందర్య అప్పట్లో కొనుక్కున్న అందమైన ఇల్లు ఇప్పుడు దారుణమైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటిని కో ఆపరేటివ్ సొసైటిగా మార్చారట. అప్పట్లో ఎంతో అందంగా ఉన్న ఇల్లు ఇప్పుడు దారుణంగా మారిపోయిందని అంటున్నారు.