ఆ వెబ్‌సైట్‌లలో నా ఫొటోలు చూసి షాకయ్యా.. : స్టార్ హీరోయిన్
Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా బహిరంగంగా వార్నింగ్ ఇచ్చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే సహించేదే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగింది?

సోనాక్షి సిన్హా ఆగ్రహం
Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తన మొదటి సినిమాతోనే తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకుంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తరుచు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇన్‌స్టా స్టోరీలో హెచ్చరిక
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ఫోటోలను కొన్ని ఈ-కామర్స్ బ్రాండ్‌లు అనుమతి లేకుండా వాడుతున్నారంటూ ఘాటుగా మండిపడ్డారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను బ్రాండింగ్ కోసం వాడుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్ లో సోనాక్షి ఇలా పేర్కొన్నారు. “నేను తరచూ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే నా వ్యక్తిగత సోషల్ మీడియా ఫోటోలు పలు బ్రాండ్ వెబ్‌సైట్‌లలో అనుమతి లేకుండా వాడుతున్నారని చూసి షాక్ అయ్యాను. నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలను ఎలా ఉపయోగిస్తారు. ఇది సరైన పద్దతేనా? ఇది ఎట్టి పరిస్థితిలో అమోదయోగ్యం కాదు?” అంటూ హెచ్చరించారు.
వెంటేనే ఆ ఫోటోలను తొలగించండి.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇంకా కంటిన్యూ చేస్తూ.. “ఏ నటి అయినా మీ దుస్తులు లేదా ఆభరణాలు ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తే మీకు క్రెడిట్ ఇస్తారు. కానీ, నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత ఫోటోను మీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టడం న్యాయమా? వెంటనే నా ఫోటోలను తొలగించండి, లేకపోతే నేను ఆ బ్రాండ్ పేర్లను బయటపెడతాను.” అంటూ వార్నింగ్ ఇచ్చారు. నటి సోనాక్షి తన పోస్ట్ లో కేవలం తన వ్యక్తిగత అసంతృప్తినే కాకుండా, డిజిటల్ కాపీరైట్, ప్రైవసీ వంటి ముఖ్యమైన అంశాలను కూడా వెలుగులోకి తీసుకవచ్చారు.
మరో హీరోయిన్ మద్దతు
ఈ వివాదంపై మరో బాలీవుడ్ సీనియర్ నటి టబు స్పందించారు. సోనాక్షి పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ “నాకూ అదే అనిపిస్తోంది” అని రాసింది. దీనికి సోనాక్షి స్పందిస్తూ.. “నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు”అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా ఇద్దరు నటి వ్యాఖ్యలు కలిసి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. నటి సోనాక్షికి హిరోయిన్ టబు మద్దతు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా సెలబ్రిటీలకు మద్దుతుగా కామెంట్స్ చేస్తున్నారు.
సోనాక్షి సిన్హా కెరీర్ అప్‌డేట్స్
సోనాక్షి తాజాగా తన సోదరుడు కుష్ ఎస్. సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన అతీంద్రియ డ్రామా "నికితా రాయ్" సినిమాలో నటించారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమై కేవలం రూ.1.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతకుముందు, సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ "హీరామండి: ది డైమండ్ బజార్" (2024)లో నటించింది. తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సోనాక్షి, తన హిట్ వెబ్ సిరీస్ "దహాద్" సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నారు.