నయా లుక్‌లో అదరగొడుతున్న సోహైల్‌..అఖిల్‌, అరియానా, మెహబూబ్‌లకు సవాల్‌

First Published Dec 24, 2020, 2:54 PM IST

బిగ్‌బాస్‌ 4 లో ట్రోఫీ గెలవలేకపోయినా.. అసలైన విజేతగా నిలిచి అందరి హృదయాలను కొల్లగొట్టాడు సోహైల్‌. అదే బజ్‌ని రెగ్యులర్‌గానూ క్రియేట్‌ చేస్తున్నారు. సోహైల్‌ షో తర్వాత ఫస్ట్ టైమ్‌ జనాల్లోకి వచ్చారు. మూడు రోజులు వరుస ఇంటర్వ్యూలతో హంగామా చేసిన ఆయన తాజాగా కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. 

`జార్జిరెడ్డి`, `ప్రెషర్‌కుక్కర్‌` చిత్రాలను నిర్మించిన అప్పిరెడ్డి.. సోహైల్‌ హీరోగా ఓ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చాడు. దీన్ని గురువారం మీడియా ముందు ప్రకటించారు.   దీనికి శ్రీనివాస్‌ వింజనంపతి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన సోహైల్‌ తన అనందాన్ని పంచుకున్నాడు. ఇంత త్వరగా హీరోగా ఆఫర్ వస్తుందని ఊహించలేదన్నారు. కచ్చితంగా నన్ను   అభిమానించే వారిని ఆకట్టుకునేలా సినిమా తీస్తానని, తన నటనతో ఆకట్టుకుంటానని తెలిపారు.

కొత్త లుక్‌లో అదరగొడుతున్నాడు. హీరో కళ సోహైల్‌లో కనిపించడం విశేషం. మరోవైపు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు.

మొక్కలు నాటి తన సామాజిక బాధ్యతని చాటుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ఈ గ్రీన్‌   ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

ఇంకా సోహైల్‌ మాట్లాడుతూ, `ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే   వేరు ఉంటుంది. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బు లు ఇచ్చి కోనుకుంటున్నాము అని రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదు అంటే బాధ్యతగా మనం   అందరం మొక్కలు నాటాలని కోరారు.

దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎం.పి సంతోష్ కుమార్ గారికి, నాకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి   కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తాను మరో ముగ్గురు ( అరియానా , మెహబూబ్ , అఖిల్ ) లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?