- Home
- Entertainment
- ఏజ్ పెరిగే కొద్ది హాట్‌నెస్ తో పిచ్చెక్కిస్తున్న స్నేహ.. కాజ్వల్స్ లో కట్టిపడేస్తున్న హోమ్లీ బ్యూటీ అందాలు
ఏజ్ పెరిగే కొద్ది హాట్‌నెస్ తో పిచ్చెక్కిస్తున్న స్నేహ.. కాజ్వల్స్ లో కట్టిపడేస్తున్న హోమ్లీ బ్యూటీ అందాలు
అందాల ముద్దుగుమ్మ స్నేహ.. క్యూట్ అందాలతో కనువిందు చేస్తుంటుంది. పెళ్లికి ముందు ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ భామ ఇప్పుడు హాట్నెస్‌తో చూపుతిప్పుకోనివ్వడం లేదు.

బొద్దు అందాలతో సినిమాల్లో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న స్నేహ.. హోబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ చాలా పద్ధతిగానే ఉండటం విశేషం. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆమె చాలా హాట్‌గా కనిపిస్తుంది. గ్లామర్ ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. నెట్టింట ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
స్నేహ లేటెస్ట్ గా తన ఫోటోలను పంచుకుంది. వైట్ టీషర్ట్, జీన్స్ ధరించి షాపింగ్ మాల్‌లో హోయల్ పోయింది. క్యూట్ అందాలతో పోజులిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. హల్‌చల్ చేస్తున్నాయి. స్నేహ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
చాలా వరకు చీరలో, నిండైన దుస్తుల్లో కనిపిస్తుంది స్నేహ. స్కిన్‌కి చాలా దూరం. కానీ ఆమెని మించిన అందం ఎవరికీ లేదంటుంటారు ఆమెని ఇష్టపడే అభిమానులు. బొద్దుగా ఉన్నా ఎంతో సెక్సీగా, హాట్ గా ఉంటుందని ఫీల్ అవుతుంటారు. ఆమెని చూస్తూ ఉండిపోతుంటారు.
అయితే లెటెస్ట్ గా ఆమె కాజ్వల్స్ లో కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఫారెన్ దుస్తుల్లో కనిపించి వాహ్ అనిపించింది. ఇందులో క్యూట్‌గానే కనిపిస్తూనే, హాట్‌నెస్ ఓవర్ లోడ్ అనేలా స్నేహ ఉండటం విశేషం. దీంతో అభిమానులు ఆమెని చూస్తూ ఉండిపోతున్నారు. హాట్ నెస్ ఓవర్‌లోడ్ అంటూ ఆమె అందానికి ముగ్దులై పోతున్నారు.
మరోవైపు తన భర్తతో నటుడు ప్రసన్నతో కలిసి అంతకు ముందు మరో ఫోటో షూట్ చేసింది స్నేహ. ఎల్లో షర్ట్, బ్లూ జీన్స్ ధరించి హోయలు పోయింది. చిలిపిగా పోజులిస్తూ కనువిందు చేసింది. ఆయా ఫోటోలు సైతం అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్నేహ మ్యారేజ్ తర్వాత సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే తెలుగులో మాత్రం చాలా తక్కువగా చేస్తుంది. కేవలం బలమైన పాత్రల్లోనే నటిస్తుంది. చివరగా ఆమె తెలుగులో `వినయ విధేయ రామ` చిత్రంలో మెరిసింది. అంతకు ముందు `సన్నాఫ్ సత్యమూర్తి`లో నటించి ఆకట్టుకుంది.
తెలుగులో హీరోయిన్‌గా చివరగా నటించిన చిత్రం `రాజన్న`. నాగార్జున సరసన నటించి కట్టిపడేసింది. ఈ చిత్ర భారీ విజయాన్నిసాధించింది. ఇక `తొలివలపు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ. `హనుమాన్ జంక్షన్` చిత్రంతో తొలి విజయాన్ని అందుకుంది. రవితేజతో నటించిన `వెంకీ` చిత్రంతో కమర్షియల్ హిట్‌తోపాటు క్రేజ్‌ని,పాపులారిటీని సొంతం చేసుకుంది స్నేహ.
`సంక్రాంతి`, `రాధాగోపాలం`, `శ్రీరామదాసు`, `ఏవండోయ్ శ్రీవారు`, `మహారథి`,`మధుమాసం`, `పాండురంగడు`, `అమరావతి`, `రాజన్న` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకుంది. తెలుగు ఆడియెన్స్ కి హోమ్లీ హీరోయిన్‌గా దగ్గరయ్యింది. కమర్షియల్ హీరోయిన్ల జోరు సాగుతున్నా, తను మాత్రం ఎక్కడా హద్దులు దాటలేదు. తన హద్దుల్లో ఉన్నసినిమాలే చేసింది తనకంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకుంది.