MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రతిక పాము డేంజర్‌.. నెటిజన్ల షాకింగ్‌ ట్రోల్స్.. రంగులు మార్చే ఊసరవెల్లి ప్రశాంత్‌ అంటూ స్టేట్‌మెంట్‌..

రతిక పాము డేంజర్‌.. నెటిజన్ల షాకింగ్‌ ట్రోల్స్.. రంగులు మార్చే ఊసరవెల్లి ప్రశాంత్‌ అంటూ స్టేట్‌మెంట్‌..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నాల్గో వారం హీరోయిన్‌ రతిక రోజ్‌ ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఆమె ప్రశాంత్‌పై సంచలన కామెంట్‌ చేసింది.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 02 2023, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ (Bigg Boss Telugu 7)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలిమినేషన్స్ మాత్రం అస్సలు ఊహించని విధంగా జరుగుతున్నాయి. అయితే ఒకటి మాత్రం స్పష్టమవుతుంది. హౌజ్‌లో పెద్దగా ఎంటర్‌టైన్‌ చేయని వారు, ఫెయిర్‌గా లేని వారిని మాత్రం హౌజ్‌ నుంచి పంపిస్తున్నారనేది వాస్తవం. నాల్గోవారం హీరోయిన్‌ రతిక ఎలిమినేట్‌ (Rathika Eliminate)అయిన విషయం తెలిసిందే. ఇది ఎవరూ ఊహించలేదు. కానీ ఎలిమినేషన్‌ని మాత్రం సమర్థిస్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రతిక రోజ్‌(Rathika Rose).. హీరోయిన్‌గా తనకు గుర్తింపు రావడం లేదని, తనకంటూ మంచి గుర్తింపు కోసం బిగ్‌ బాస్‌ షోకి వచ్చినట్టు తెలిపింది రతిక రోస్‌. గ్లామర్‌తో మెప్పించింది. హౌజ్‌లో గ్లామర్‌ని పంచింది. అయితే మొదటి రోజ్‌ నుంచే ఆమె పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ బ్యాండ్‌ ఇస్తే తీసుకుని, ఆయనతో కలిసి తిరిగింది, క్లోజ్ గా మూవ్‌ అయ్యింది. ఆ తర్వాత హ్యాండిచ్చింది. అలా ప్రిన్స్ యావర్‌తోనూ అదే చేసింది. శివాజీతోనూ గొడవపడింది. దీంతో ఆమెపై నెగటివ్‌ ఇంప్రెషన్‌ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా ఎలిమినేట్‌ అయ్యింది. ఓ రకంగా తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టయ్యింది. 
 

37

రతిక ఇంకా రియలైజ్‌ కాలేదు. తాను ఏం మిస్టేక్‌ చేసిందో కూడా తెలుసుకునే స్థితిలో ఎలిమినేట్‌ అయ్యింది. అనంతరం `బిగ్‌ బాస్‌ బజ్‌`కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. గత బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌(Geetu Royal) హోస్ట్ గా ఈ షో రన్‌ అవుతుంది. ఇందులో బోల్డ్ గా ప్రశ్నలు సందిస్తూ కంటెస్టెంట్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది గీతూ రాయల్‌. తాజాగా రతికని కూడా ఓ రేంజ్‌లో ఆడుకుంది. అందరిని వాడుకుంది, ఆడుకుంది. చివరికి వాడిపోయిందంటూ గీతూ రాయల్‌ ఆమెని సంభోదించడం గమనార్హం. 

47

`బాహుబలి`లో కట్టప్పనే క్రాస్‌ చేశారనిపించిందని గీతూ రాయల్‌ ఎటాక్‌ స్టార్ట్ చేసింది. ఎవరిని వెన్నుపోటు పొడిచాను అని రతిక అడగ్గా, హై ఫై ఇస్తూ, రెండు చేతులు కలిస్తేనే సౌండ్‌ వస్తుంది. ప్రశాంత్‌ విషయంలో చేయి అందించిందే మీరు అని చెప్పగా, నేనా అంటూ అమాయంగా రియాక్ట్ అయ్యింది రతిక. దీనికి గీతూ కౌంటర్‌ ఇస్తూ, మీరు హౌజ్‌లోనే కాదు, ఇక్కడ కూడా మానుప్యూలేట్‌ చేస్తున్నారని చెప్పడంతో రతిక మొఖం వాడిపోయింది. 

57

ఈ సందర్భంగా `ఎక్స్` అనే ఒక ఎమోషన్‌ని బాగా వాడుకున్నట్టు అనిపించింది. వాడుకోవడం మీకు అలవాటే కదా? అనగా, వాడుకునే దాన్ని అయితే వాడుకునే టైమ్‌లో వాడుకునేదాన్ని అని రియాక్ట్ అయ్యింది రతిక. శుభ శ్రీ మిమ్మల్ని నామినేట్‌ చేసినప్పుడు మీరో మాట అన్నారు. కానీ నిన్ను నమ్మి నీకో మాట చెబితే, నువ్వు వేరే వాళ్లకి చెబితే అది మంచిది అని గీతూ అడగ్గా, అది నాకు గుర్తు లేదని రతిక రియాక్ట అవగా, అనేవన్నీ అని నాకు గుర్తు లేదు, మర్చిపోయాను అనేది కూడా నీ స్ట్రాటజీనా రతిక అని గీతూ కడిగి పడేసింది. 
 

67

అమర్‌ నీకో మాట చెప్పినట్టు ప్రశాంత్‌ నీ వల్లే సర్వైవ్‌ అవుతున్నాడా? అని ప్రశ్నించింది గీతూ, దీనికి రతిక స్పందిస్తూ, హౌజ్‌లో చాలా జరుగుతుంటాయని చెప్పింది. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అంటారు. కానీ తమ్ముడితోనే పేకాట ఆడావ్‌ అన్నది గీతూ. ఈ సందర్భంగా మీమ్స్ ట్రోల్స్ ని రతిక ముందు పెట్టింది. ప్రశాంత్‌ ఏడ్చే స్టార్ అయితే, నువ్వు కన్నింగ్‌ స్టార్‌, ఫ్లిప్పింగ్‌ స్టార్‌ అంటూ ముద్ర వేశారు. అంతేకాదు రతిక కంటే పాము బెటర్‌ అంటూ పోస్ట్ లు పెట్టారు. అది అలా పోట్రే అయితే అది నా కర్మ నేనేం చేయలేదు` అని చెప్పింది రతిక. ఓ రకంగా పాము కంటే రతిక డేంజర్‌ అనే కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. మరి పూర్తి ఇంటర్వ్యూ ఎంత రంజుగా ఉంటుందో ఊహించుకోవచ్చు. 
 

77

ఇక రతిక ఎలిమినేషన్‌లో ఆమె చేసిన మిస్టేక్స్ వల్లే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎవరితోనూ సరైన రిలేషన్‌ మెయింటేన్‌ చేయలేదని, పైగా మొదట నమ్మించేలాగా, క్లోజ్ గా మూవ్‌ అవుతూ, తర్వాత తనతో ఇలా ఉన్నాడంటూ ఆమె నామినేట్‌ చేసింది. అందరి ముందు పరువు తీసింది. ఇంకోవైపు ప్రిన్స్ యావర్‌తోనూ అలానే ఉంది. తర్వాత హ్యాండించ్చింది. శివాజీతోనూ అనవసర రాద్దాంతం చేసింది. దీంతో అవన్నీ ఆమె ఓట్లపై ప్రభావాన్ని చూపించాయి. దీంతో తక్కువ ఓట్లు పడ్డాయి. ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. ఇక ఇప్పటి వరకు నలుగురు ఆడవారే ఎలిమినేట్‌ కావడం గమనార్హం. మొదటి వారంలో కిరణ్‌ రాథోర్‌, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, ఇప్పుడు రతిక.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved