- Home
- Entertainment
- ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు.. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టీవీ స్టార్ ఎవరో తెలుసా?
ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు.. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టీవీ స్టార్ ఎవరో తెలుసా?
Highest Paid TV Actresses: ప్రస్తుతం బుల్లితెర నటులు కూడా సినిమా స్టార్స్‌తో సమానంగా క్రేజ్ సంపాదిస్తున్నారు. స్టార్‌డమ్‌తో పాటు, రెమ్యునరేషన్ విషయంలో కూడా సినిమా నటులతో పోటీపడుతున్నారు. ఇంతకీ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి ఎవరో తెలుసా?

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టీవీ స్టార్
Highest Paid TV Actresses: ప్రస్తుతం బుల్లితెర నటులు కూడా సినిమా స్టార్స్‌తో సమానంగా క్రేజ్ సంపాదిస్తున్నారు. స్టార్‌డమ్‌తో పాటు, రెమ్యునరేషన్ విషయంలో కూడా టాప్ హీరో, హీరోయిన్లతో పోటీపడుతున్నారు. అంతే చాలామంది నటీనటులు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక్కో సీరియల్స్ కు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇంతకీ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి ఎవరు ? అనేది ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి?
దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి ఎవరో కాదు. మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. తొలుత ఆమె నటిగా, మోడల్ గా సక్సెస్ అందుకున్న తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లి తనను స్టార్‌గా నిలబెట్టిన టీవీ స్క్రీన్‌కి రీ-ఎంట్రీ ఇచ్చారు. 'క్యూంకి సాస్ భీ కభీ బహు థీ 2' ద్వారానే ఆమె తిరిగి టీవీలోకి వచ్చింది. అభిమానులకు బాగా నచ్చిన తులసి విరాణి పాత్రలో తిరిగి నటిస్తుంది. అయితే.. స్మృతి ఇరానీ రెమ్యునరేషన్ అనేేది హాట్ టాపిక్ గా మారింది.
ఇండియన్ టెలివిజన్‌లో ఇప్పటివరకు ఎవరూ అందుకుని విధంగా స్మృతి ఇరానీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్. మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఒక్కో ఎపిసోడ్‌కి ఏకంగా రూ.14 లక్షలు వసూలు చేస్తూ, ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టీవీ నటిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా షూటింగ్ సమయంలో ఆమెకు Z+ సెక్యూరిటీ ఇవ్వనున్నారు.
స్మృతి ఇరానీ క్లారిటీ
మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. "ప్రొఫెషనల్‌గా మేము కూడా మా ఒప్పందాల కోసం చర్చలు జరుపుతాం. విజయం సాధించినప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ పొందడం సహజం. కానీ అదే సమయంలో సమాన వేతనం అందరికి రావాలని కూడా నమ్ముతాను" అని పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తం తీసుకుంటున్నారో మాత్రం నేరుగా చెప్పలేదు. తనతో ఉన్న ఇతరులను కూడా స్టార్‌లుగా మార్చగల సామర్థ్యం తనకు ఉందని స్మృతి అంగీకరించారు. అదే సమయంలో ఇది బాధ్యతతో కూడుకున్న విషయం అని తెలిపారు.
స్మృతి టీవీ జర్నీ
స్మృతి ఇరానీ 2000లో ఆతిష్ సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టరు. ఆ తరువాత కవిత వంటి సీరియల్స్‌లో నటించారు. అయితే.. ఆమెకు నిజమైన స్టార్‌డమ్‌ను తెచ్చినపెట్టిన సీరియల్ మాత్రం ‘క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ’. 2000లో మొదలైన ‘క్యూంకి సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్‌లో తులసి విరాణి పాత్రతో ప్రతి ఇంటికీ చేరుకున్న స్మృతి, ఎనిమిదేళ్ల పాటు ఈ షోలో నటించారు. ఇది కుటుంబ సంఘర్షణలు, విలువలు, సంప్రదాయాలు, తరాల మధ్య తేడాలను చూపించిన సీరియల్‌గా ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఈ సీరియల్‌తో స్మృతి ఇరానీ కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు రెండో సీజన్‌లో అమర్ ఉపాధ్యాయ్‌తో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ స్టార్ ప్లస్లో ప్రసారం అవుతుంది, అలాగే జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాజకీయ ప్రస్థానం
2003లో భారతీయ జనతా పార్టీలో చేరిన స్మృతి, 2004లో మహారాష్ట్ర యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె అమేథి ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించి లోక్‌సభకు విజయం సాధించడం ఆమె రాజకీయ కెరీర్‌లో పెద్ద మైలురాయి. యూపీఏ 1 నరేంద్రమోడీ మంత్రిమండలిలో 2024 వరకు కేంద్ర మంత్రిగా పని చేసింది. కానీ, 2024 ఎన్నికలలో ఇరానీ అమేథిలో కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో మళ్లీ బుల్లితెరపై అడుగుపెట్టారు. కాబట్టి, 2025లో ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి స్మృతి ఇరానీ అని చెప్పుకోవచ్చు.