#Prince: 'ప్రిన్స్' OTT రైట్స్ ఎవరికి, ఎంతకి అమ్మారు? పెద్ద డీలే
శివ కార్తికేయన్ టాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘ప్రిన్స్’ (Prince) అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం కెవి. అనుదీప్(KV. Anudeep) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదలకు ముందే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక గా నిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న 'ప్రిన్స్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ వివరాలు బయిటకు వచ్చాయి.
జాతరత్నాలు సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన అనుదీప్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండడం ఈ సినిమాకు క్రేజ్ నెలకొని ఉంది. కామెడీని ఎంతో సెన్సిబుల్ గా తెర పైన చూపిస్తూ ప్రేక్షకులను నవ్వులు పూజిస్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు మరొక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రైట్స్ ని Disney+ Hotstar వారు సొంతం చేసుకున్నారు.
ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు, సన్ నెట్ వర్క్ టీవి ఛానెల్స్ కలిపి తీసుకున్నారు. తమిళ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మొత్తం 42 కోట్లు ఈ డీల్ నిమిత్తం సినిమా టీమ్ కు అందింది.
డాక్టర్ వరుణ్ మరియు కాలేజ్ డాన్ లాంటి సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న హీరో శివకార్తికేయన్ కి తెలుగు లో డీసెంట్ మార్కెట్ ఉంది.ఈ చిత్రం తెలుగు లో చాలా వరకు ఓన్ గానే రిలీజ్ అవుతూ ఉండగా వాల్యూ బిజినెస్ లెక్క మొత్తం మీద 9.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా… అందులో నైజాం బిజినెస్ 3.50 కోట్లు సీడెడ్ బిజినెస్ 2 కోట్లు అంటున్నారు. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 50 కోట్లకు పైగా ఉంది.
. తెలుగు, హిందీ థియేట్రీకల్ రైట్స్, హిందీ ఓటీటీ రైట్స్ నుంచి భారీగానే లభిస్తాయట. అన్ని రైట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా రూ.100కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఇదీ సినిమా మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 100 కోట్ల రేంజ్ లో… గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు, ఆల్ రెడీ బాక్ టు బాక్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న శివకార్తికేయన్ ఈ సినిమాతో హాట్రిక్ ని కంప్లీట్ చేస్తాడో లేదో చూడాలి.
తెలుగులో ఇటీవల వచ్చిన `జాతిరత్నం` చిత్రం ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఫ్యూర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఈసినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు దర్శకుడు అనుదీప్. ఆయన అమాయకత్వపు ప్రవర్తనే `జాతిరత్నం`లో కనిపిస్తుంది. అందుకే సినిమాతోపాటు అనుదీప్ కూడా పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తోన్న చిత్రం `ప్రిన్స్`. `రెమో`, `డాక్టర్`, `డాన్` వంటి చిత్రాలతో తెలుగులోమార్కెట్ ఏర్పర్చుకుంటూ వచ్చిన శివ కార్తికేయన్ హీరోగా ఈ `ప్రిన్స్` చిత్రాన్ని బైలింగ్వల్‌గా రూపొందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా శుక్రవారం(అక్టోబర్ 21)న విడుదలైంది. ఓ వైపు తమిళంలో `సర్దార్`తో, ఇటు తెలుగులో `ఓరిదేవుడా`,`జిన్నా` చిత్రాలతో పోటీ పడుతూ విడుదలవుతుంది.
ఈ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని దాటి అనుదీప్ దర్శకుడుగా మరో మెట్టు ఎక్కుతాడా అనేది చూడాలి. తమన్ సంగీతం సమకూర్చగా ఈ సినిమా నుంచి విడుదలైన చాలా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సింపుల్ కామెడి తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుదీప్ ఈ సినిమా తో అలాంటి కామెడీ ని ప్రేక్షకులనున్ అలరిస్తారని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ లో కొన్ని కామెడీ పంచులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యం లో ఈ సినిమా తో మళ్ళీ కామెడి పరంగా అయన ఎంతో అలరించబోతున్నాడు అని చెప్పాలి.