- Home
- Entertainment
- వెకేషన్‌లో సితార పాప క్యూట్ పోజులు.. ఫారెన్‌లో మహేష్ కూతురు రచ్చ మామూలుగా లేదుగా!
వెకేషన్‌లో సితార పాప క్యూట్ పోజులు.. ఫారెన్‌లో మహేష్ కూతురు రచ్చ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార సెలబ్రిటీ హోదాని పొందుతుంది. స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తుంది. అంతేకాదు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.

మహేష్ బాబు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు లండన్‌లో గడిపారు. అక్కడి అందాలను ఆస్వాదించారు. ఇప్పుడు స్కాట్ లాండ్‌లో హంగామా చేస్తున్నారు.
తాజాగా సితార స్కాట్‌లాండ్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో క్యూట్ అందాలతో ఆకట్టుకుంటుంది సితార. బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ ధరించింది. చిలిపి పోజులిస్తూ అలరిస్తుంది. వెకేషన్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది.
స్కాట్ లాండ్‌లోని గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ, ఆ చెట్ల పొదల్ల వద్ద కూర్చొని అందమైన పోజులిచ్చింది. ఇందులో సితార పాప చిలిపి పోజులు ఎంతగానే ఆకర్షిస్తున్నాయి. ముద్దొస్తున్నాయి. ఈ ఫోటోలను పంచుకుంటూ సితార స్కాట్‌లాండ్ గురించి పోస్ట్ పెట్టింది. ఎత్తైన లాండ్‌ని కోల్పోతున్నట్టు పేర్కొంది. దాన్ని మిస్ అవుతున్నట్టు సితార పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సితార ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. `సర్కారు వారి పాట` ప్రమోషనల్ సాంగ్‌లో మెరిసింది. ఓ హాలీవుడ్ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది. కానీ ఎవరికీ సాధ్యం కాని స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తుంది. ఆమె ఇటీవల న్యూయార్క్ లోని టైమ్ స్వ్కైర్‌పై ప్రదర్శించబడిన విషయం తెలిసిందే.
ఆభరణాల సంస్థ చేసిన యాడ్ షూట్ వీడియాలోని ఇందులో ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్‌గా సితార సంచలనం సృస్టించింది. ఇలా సినిమాల్లోకి ఎంట్రీకి ముందే ఆమె స్టార్‌గా వెలుగొందుతుంది. ఈ యాడ్ షూట్‌కిగానూ ఏకంగా కోటీ రూపాయలు పారితోషికం తీసుకుందట. అంతేకాదు ఈ సంస్థ సితార పేరుతో ఓ బ్రాండ్‌ని కూడా లాంచ్ చేయడం విశేషం. ఈ యాడ్ వల్ల వచ్చిన మనీని ఎంబీ ఫౌండేషన్‌కి ఇస్తానని తెలిపింది సితార. అందరి మన్ననలు పొందింది.