- Home
- Entertainment
- సింగర్ కేకే కుటుంబం, చదువు,పెళ్లి ,ఆస్తుల వివరాలు, బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఎదిగిన గాయకుడు
సింగర్ కేకే కుటుంబం, చదువు,పెళ్లి ,ఆస్తుల వివరాలు, బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఎదిగిన గాయకుడు
సింగర్ కెకె హఠాత్మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది. సౌత్ నార్త్ కలిపి వేల పాటలు పాడిన కేకే మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంతకీ ఎవరు ఈ కేకే, ఎలా ఎదిగాడు..? ఎక్కడివాడు..? ఫ్యామిలీ వివరాలేంటి.

హిందీతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో వేల పాటలు పాడిన ప్రముఖ గాయకుడు కేకే నిన్న రాత్రి హఠాత్తుగా మరణించారు. కోల్ కతాలో ఓ లైవ్ షోలో పాల్గోన్న ఆయన.. తన రూమ్ కు వెళ్లిన సమయంలో మెట్లపైనుంచి పడి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.53 ఏళ్ల వయస్సులో కేకే మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
స్టార్ సింగర్ గా అంచెలంచెలుగా ఎదిగిన కేకే లైఫ్ అందరికి ఆదర్శం. ఆయన ఫ్యామిలీ, చదువు, సింగర్ గా ఆయన ప్రస్తానం వివరాలు చూస్తే...
ఆగష్టు 23, 1968న న్యూ ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన కేకే పూర్తిపేరు కృష్ణకుమార్ కున్నాత్, అతను కేకేగా స్క్రీన్ నేమ్ తో ఫేమస్ అయ్యాడు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నేపథ్య గాయకుడిగా ఫేమస్ అయిన అతను ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ స్కూల్‌లో చదువుకున్నాడు. అంతే కాదు ఢిల్లీ యూనివర్సిటీ కిరోరి మాల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
1999లో కేకే తన చిన్ననాటి స్నేహితురాలు.. ప్రియురాలు జ్యోతిని పెళ్లి చేసుకున్నారు.కేకే మరియు అతని భార్య జ్యోతి వారి ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేశాడు. వారిద్దరికి ఒక కుమారుడు నకుల్ కృష్ణ కున్నాత్ మరియు కుమార్తె తమరా కున్నాత్ ఉన్నారు.
Image: KK/Instagram
కేకే పే గాయకుడిగా కిషోర్ కుమార్ మరియు RD బర్మన్ వంటి ప్రఖ్యాత గాయకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక హాలీవుడ్ రేంజ్ లో అతను మైఖేల్ జాక్సన్, లెడ్ జెప్పెలిన్, బ్రయాన్ ఆడమ్స్ మరియు బిల్లీ జోయెల్‌లను ఆదర్శంగా తీసుకున్నాడు. ఎటువంటి రికెమండేషన్ లేకుండా.. తన సొంత టాలెంట్ తో.. సాధారణ స్థాయి నుంచి స్టార్ సింగర్ గా ఎదిగాడు కేకే.
kk
జింగిల్స్ నుండి ప్లేబ్యాక్ సింగింగ్ వరకు KK తన కెరీర్‌ను చాలా వివాదరహితంగా.. అందంగా మలుచుకున్నారు. తన మధుర గాత్రంతో అన్ని భాషల్లో అభిమానులను సాధించుకున్నాడు. ప్లేబ్యాక్ సింగర్‌గా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ముందు అతను అనేక జింగిల్స్ రాసి పాడాడు.
Image: KK/Instagram
KK హిప్ హిప్ హుర్రే, జస్ట్ మొహొబ్బత్ మరియు షకలక బూమ్ బూమ్ వంటి కొన్ని టెలివిజన్ షోలకు కూడా పాడారు. కెకెను నేపథ్య గాయకుడిగా పరిచయం చేసింది ఏఆర్ రెహమాన్. తరువాత, అతను 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రం నుండి సల్మాన్ ఖాన్ చిత్రీకరించిన అత్యంత ప్రజాదరణ పొందిన 'తడప్ తడప్' పాటతో తన బాలీవుడ్ అరంగేట్రం చేసాడు.
తెలుగులో కూడా కేకేకు వేల మంది అభిమానులు ఉన్నారు. ఆయన పాటల కలెక్షన్ చేసుకున్నావారు ఎంతో మంది. అన్ని రకాల పాటలు తన గాత్రంలో పలికించి.. మురిపించిన కేకే హఠాత్మరణం.. సినీ సంగీత ప్రియల హృదయాలను గాయం చేసింది. పాటల ప్రేమికుల మనసును బాధతో నింపింది.