- Home
- Entertainment
- ఘనంగా యంగ్ సింగర్ అర్మన్ మాలిక్ ఎంగేజ్మెంట్ , యూట్యూబర్ ను పెళ్లాడబోతున్న స్టార్ సింగర్..
ఘనంగా యంగ్ సింగర్ అర్మన్ మాలిక్ ఎంగేజ్మెంట్ , యూట్యూబర్ ను పెళ్లాడబోతున్న స్టార్ సింగర్..
ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్ లాంటి తారులు రీసెంట్ గా పెళ్ళి బంధంలో అడుగు పెట్టగా.. తాజాగా ఓ స్టార్ సింగర్ పెళ్లి పీటలెక్కబోతున్నట్టు ప్రకటించారు.

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యంగ్ స్టార్స అంతా పెళ్లిళ్లతో ఓ ఇంటివారు అవుతున్నారు. టాలీవుడ్ తో పాటు హిందీ, తమిళ్ , కన్నడ ఇతర భాషల స్టార్స్ కూడ పెళ్ళిల్లు చేసుకుంటూ.. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెపుతున్నారు. తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ ఏజ్ లోనే స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకున్న అర్మాన్ మాలిక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఇక ఈ యంగ్ సింగర్ అర్మన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా కాలంగా అతను ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్లాగర్, ఫేమస్ యూట్యూబర్ అశ్న ష్రఫ్ తో ప్రేమలో ఉన్నాడు. అయితే సోషల్ మీడియా ద్వారా చాలా మందికి ఈ విషయం తెలుసు..ఇక ఈ క్రమంలో.. అతను తన ప్రియురాలితో ఉన్న ప్రేమ బంధాన్ని పెళ్ళి బంధంగా మార్చుకోబోతున్నాడు. అశ్నతో ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది.
నిన్న (ఆగస్టు 28) వీరి నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగింది.అర్మన్.. మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడిగిన ఫోటో తో పాటు.. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన కొన్ని పోటోలు నెట్టింట్ట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంటకు అంతా ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధుర క్షణాలను ఎప్పటికీ మరచిపోలేము అంటూ అర్మన్, అశ్న ష్రఫ్ లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
స్టార్ సింగర్ అర్మన్ మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినా.. భారతదేశం అతట.. అతని వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. తన గాత్రంతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించడంతో పాటు.. వరుస ఆఫర్లు కూడా సాధించాడు. ఇక ఆయన హిందీతో పాటు తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ,కన్నడ, గుజరాతీ, తమిళ, పంజాబి, మలయాళ, ఉర్దు, భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు.
మరీ ముఖ్యంగా మన తెలుగు భాషలో అతని పాటలకు ఫిదా అయ్యారు ఆడియన్స్. తెలుగులో అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాట, వరుణ్ తేజ్ తొలిప్రేమ లోని నిన్నిలా.. నిన్నిలా చూశానే, అరవింద సమేత సినిమాలో , బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో పెదవులు దాటని పదం పదంలో.., పడి పడి లేచె మనసు అంటూ.. శర్వానంద్ సినిమాలో టైటిల్ సాంగ్ ను కూడా పాడి సినీ సంగీత ప్రియుల మనసు దోచుకున్నాడు అర్మాన్ మాలిక్.
అలవైకుంఠపురములో సినిమాకు గాను.. సైమా` అవార్డ్ ను కూడా గెలుచుకున్నాడు అర్మాన్ మాలిక్.. ఈసినిమాలో బుట్టబొమ్మ పాటకు ఉత్తమ గాయకుడిగా అర్మాన్ మాలిక్ సైమా అవార్డుని అందుకున్నారు. అవార్డుతో ఇలా పోజులిచ్చారు.