MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కాళ్లు బారున చాచి ఊరమాస్‌ లుక్‌లో కేకపెట్టిస్తున్న శృతి హాసన్.. సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా అంటూ షాక్‌

కాళ్లు బారున చాచి ఊరమాస్‌ లుక్‌లో కేకపెట్టిస్తున్న శృతి హాసన్.. సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా అంటూ షాక్‌

శృతి హాసన్‌.. అందాల ప్రదర్శనలో తనది ప్రత్యేక స్టయిల్‌. బ్లాక్‌, షేడ్స్ లుక్‌ ఫోటోలను పంచుకుంటూ కిర్రాక్‌ పుట్టిస్తుంది. మరోవైపు సినిమాలకు అప్పుడే గుడ్‌ బై చెప్పాలనుకున్నా అంటూ తాజాగా షాకింగ్‌ విషయాలను వెల్లడించి ఫ్యాన్స్ ని షాక్‌ కి గురి చేసింది శృతి హాసన్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 16 2021, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ ట్యాగ్‌ని ఎప్పుడే తీసేసింది శృతి హాసన్‌. ఇప్పుడు శృతి అంటే ఓ స్టార్‌ హీరోయిన్‌. ఓ సింగర్‌, ఓ మ్యూజీషియన్‌. ఇలా తనకంటూ ఓ చాలా స్పెషాలిటీలను ఏర్పర్చుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌ కిడ్‌ కావడంతో గ్లామర్‌కి దూరంగా ఉంటుందనే భావన సాధారణంగా అందరిలోనూ ఉంటుంది. కానీ ఆ ఆలోచనలను ఎప్పుడే బ్రేక్‌ చేసింది. తాను అందరి లాంటి హీరోయిన్‌ నే అని నిరూపించుకుంది. 

311

అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకాడదు శృతి. పాత్ర డిమాండ్‌ మేరకు, కమర్షియల్‌ అంశాల కోసం సినిమాల్లో పొదుపు దుస్తుల్లో మెరుస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టించడంలో శృతి తనకు తానే సాటి. 

411

ఆ మధ్య కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ సినిమాల్లో రాణిస్తున్న శృతి ప్రస్తుతం పలు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల `క్రాక్‌`, `వకీల్‌సాబ్‌` చిత్రాలతో విజయాలను అందుకుంది. ఇప్పుడు ప్రభాస్‌ సరసన `సలార్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు తమిళంలో `లాభం` చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. 

511

మరోవైపు డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తుంది. ఈ విషయాలను కూడా డేరింగ్‌గా చెబుతూ, ఆయనతో అల్లుకు తిరుగుతున్న ఫోటోలను పంచుకుంటూ డేటింగ్‌ విషయాలను కూడా ఓపెన్‌గా చెబుతుంది శృతి. 

611

ఇదిలా ఉంటే తాజాగా మరో షాక్‌ ఇచ్చిందీ అందాల భామ. సినిమాల నుంచి తప్పుకోవాలనుకుందట. కేవలం తన డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసమే సినిమాల్లోకి వచ్చింది. నటిగా మారిందట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. మ్యూజిక్‌పై తనకున్న ఇష్టాన్ని పంచుకుంది శృతి. 

711

`కాలేజీలో ఉన్నప్పుడు రాక్‌స్టార్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. ఎలాగైనా సొంతంగా ఒక రాక్‌బ్యాండ్‌ నడపాలి అనుకున్నా. అయితే బ్యాండ్‌ నడపాలంటే డబ్బు కావాలి. అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. అందుకే హీరోయిన్‌గా రెండు, మూడు సినిమాలు చేసి, వచ్చిన ఆ డబ్బుతో బ్యాండ్‌ స్టార్ట్‌ చేసి సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. 

811

కానీ ఇక్కడకు వచ్చాక నాకు తెలియకుండానే నటనను ఇష్టపడ్డాను. మెల్లిగా సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇండస్ట్రీయే నా ప్రపంచం అయ్యింది` అని తెలిపింది శృతి. 
 

911

తను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న సంగీతాన్ని మాత్రం వదిలి పెట్టలేదని, విరామం దొరికినప్పుడు తన సమయం మ్యూజిక్‌కు కేటాయిస్తానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం శృతి తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతానుతో కలిసి మ్యూజిక్‌ మొదలు పెట్టె ప్లాన్‌లో ఉన్నట్లు తెలిపింది. `మీ తండ్రి పెద్ద స్టార్‌ కదా. ఆయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకోలేద`ని అడగ్గా.. తనకు సొంతగా ఎదగడం ఇష్టమని, అది తన కల, తాను సొంతంగా సంపాదించిన డబ్బుతోనే కలను నిజం చేసుకోవాలనుకున్నాన`ని చెప్పి నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందీ సెక్సీ అందాల భామ.
 

1011

మరోవైపు తాజాగా తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. తొడలు కనిపించేలా పొట్టి షాట్‌ ధరించి ఊర మాస్‌ పోజులిచ్చింది. ట్రెండీ వేర్‌లో ఈ అమ్మడు ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్నాయి. తెగ వైరల్‌ అవుతున్నాయి. 
 

1111

శృతి ఇలా డేరింగ్‌గా, అందాలను ఆరబోయడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వరుసగా ఆమె పిక్స్ షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image3
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved