- Home
- Entertainment
- శృతి, రష్మిక, కీర్తి, పాయల్, వైష్ణవి చైతన్య.. 2023లో బ్లాక్ బాస్టర్లు అందుకున్న హీరోయిన్లు.!
శృతి, రష్మిక, కీర్తి, పాయల్, వైష్ణవి చైతన్య.. 2023లో బ్లాక్ బాస్టర్లు అందుకున్న హీరోయిన్లు.!
2023లో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా హీరోయిన్లు బ్లాక్ బాస్టర్లతో కుమ్మేశారు. కొందరు సినిమా సక్సెస్ తో సెన్సేషన్ గా మారితే.. మరికొందరు తమ పెర్ఫామెన్స్ తో సంచలనంగా మారారు. ఆ హీరోయిన్లు ఎవరు? ఎలాంటి సినిమాలు చేశారనే విషయాలు తెలుసుకుందాం.

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) ఈ ఏడాది రెండు బ్లాక్ బాస్టర్లను అందుకుంది. జనవరిలో విడుదలైన చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో సక్సెస్ అందుకుంది. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి దుమ్ములేపాయి. ఈసారి హీరోయిన్లలో శృతిహాసన్ తోనే 2023లో బ్లాక్ బాస్టర్లు ప్రారంభమయ్యాయి.
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) తెలుగులో తొలి బ్లాక్ బాస్టర్ ను అందుకుంది. ధనుష్ టాలీవుడ్ లో చేసిన డైరెక్ట్ ఫిల్మ్ ‘సార్’తో సంయుక్తకు బ్లాక్ బాస్టర్ అందింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ప్రశంసించారు. దాంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఎలాంటి అంచనాలు లేకుండా... చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన నటించిన కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan ram) కు ఈ చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందింది. తన పెర్ఫామెన్స్ తోనూ మెప్పించింది. ప్రస్తుతం ఆయా ఆఫర్లతో బిజీగా ఉంది.
నేచురల్ స్టార్ నానితో పాన్ ఇండియా ఫిల్మ్ ‘దసరా’లో వెన్నెల కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన విషయం తెలిసిందే. డీ గ్లామర్ రోల్ లో నటించినా తన పెర్ఫామెన్స్ తో ఇరగదీసింది. డాన్స్ తోనూ ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడం విశేషం. దీంతో కీర్తికీ 2023లో బ్లాక్ బ్లాస్టర్ దక్కింది.
మరో చిన్న బడ్జెట్ సినిమా ‘మేమ్ ఫేమస్’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ - సార్య లక్ష్మణ్ జంటగా నటించారు. సార్య ‘మౌనిక’ పాత్రలో అద్భుతంగా నటించింది. పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంది. ఈ సినిమాతో తనూ మంచి సక్సెస్ అందుకుంది.
2023లో సెన్సేషనల్ గా మారిన యంగ్ హీరోయిన్లలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) పేరు మొదట ఉంటుంది. Baby మూవీలో తన పెర్ఫామెన్స్ కు ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మొత్తానికి కెరీర్ లో మొదటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ ను అందుకుంది.
‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు దక్కించుకున్న నేహా శెట్టికి ఈ ఏడాది విడుదలైన ‘బెదురులంక2012’తో డీసెంట్ హిట్ దక్కింది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ఇక స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ‘ఖుషి’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవుతోంది. సామ్ నుంచి నెక్ట్స్ ‘సిటాడెల్’ రానుంది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) ఈ ఏడాది ‘భగవంత్ కేసరి’తోనే మంచి హిట్ పడింది. విజ్జిపాపగా తన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.
‘మంగళవారం’తో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఈ ఏడాది టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారారు. మళ్లీ తన క్రేజ్ ను ఈ చిత్రంతో తిరిగి పొందారు. ఆమె నటనకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది.
ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన ‘యానిమల్’ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. చివరిగా ‘పుష్ప’తో అదరగొట్టిన శ్రీవల్లి.... యానిమల్ తో మళ్లీ సెన్సేషన్ గా మారింది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మూవీ కూడా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అదరగొడుతోంది.