MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • స్టార్‌ హీరోతో శృతి హాసన్‌ ఐటెమ్‌ సాంగ్‌..? బిగ్‌ స్టార్‌తో మరోసారి లెగ్‌ షేక్‌ చేయబోతున్న కమల్‌ తనయ ?

స్టార్‌ హీరోతో శృతి హాసన్‌ ఐటెమ్‌ సాంగ్‌..? బిగ్‌ స్టార్‌తో మరోసారి లెగ్‌ షేక్‌ చేయబోతున్న కమల్‌ తనయ ?

శృతి హాసన్‌ ఇప్పటికే మూడు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. కానీ ఇప్పుడు ప్రాపర్‌ ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతుందట. బిగ్‌ మాస్‌ హీరోతో లెగ్‌ షేక్‌ చేస్తుందట శృతి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 15 2024, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shruti Haasan talks about her Polycystic Ovary Syndrome

Shruti Haasan talks about her Polycystic Ovary Syndrome

శృతి హాసన్‌ సినిమాల ఎంపికలో చాలా సెలక్టీవ్ గా ఉంటుంది. ఆమె సినిమా చేసిందంటే అది హిట్టే అనే టాక్‌ ఉంది. వరుస విజయాలతో గోల్డెన్‌ లెగ్‌ అనే ముద్ర కూడా పడింది. ఇటీవల ఆమె నటించిన `క్రాక్‌`, `వకీల్‌ సాబ్‌`, `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. దీంతో శృతి హాసన్ పై అందరిలోనూ ఓ నమ్మకం, అంచనాలు ఏర్పడ్డాయి.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శృతి హాసన్‌  ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుండటం విశేషం. ఇప్పటికే ఆమె `ఆగడు` సినిమాలో `జంక్షన్‌లో` నే పాట చేసింది. అలాగే హిందీలో `తేవర్‌` మూవీలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇటీవల `హాయ్‌ నాన్న` చిత్రంలోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌ లో మెరిసింది. కానీ అవేవీ పెద్దగా హిట్‌ కాలేదు. సినిమాలు ఆడకపోవడంతో అవి తేలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగులో మరో ప్రాపర్‌ ఐటెమ్ సాంగ్‌ చేస్తుందట శృతి హాసన్‌. 
 

37

ఓ బిగ్‌ స్టార్‌తో కలిసి ఆమె లెగ్‌ షేక్‌ చేస్తుందట. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అవును చిరంజీవితో ఆమె మరోసారి లెగ్‌ షేక్‌ చేయబోతుంది. ఇప్పటికే `వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలో ఈ ఇద్దరు జంటగా నటించారు. అందులో ఈ ఇద్దరు చేసిన డాన్సులు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. ఆ మ్యాజిక్‌ని ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ రూపంలో రెట్టింపు చేయబోతున్నారట. 
 

47

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, విజువల్‌ గ్రాండియర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హనుమంతుడి బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుందట. టైమ్ ట్రావెల్‌ ఎలిమెంట్లు ఉంటాయని తెలుస్తుంది. దీనికి `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్‌, మృణాల్‌ ఠాకూర్, ఇషా చావ్లా, సురభీ చిరుకి సిస్టర్స్ పాత్రల్లో మెరుస్తారని తెలుస్తుంది. వీరితోపాటు కునాల్‌ కపూర్, శ్రీ విష్ణు, రావు రమేష్‌, వెన్నెల కిశోర్‌, హర్షవర్థన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. 
 

57

ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్ పూర్తయ్యిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి. వీఎఫ్‌ఎక్స్ కి స్కోప్‌ ఉన్న మూవీ. దాదాపు ఐదు నెలలు దీనిపైనే కూర్చోబోతుందట టీమ్‌. మరోవైపు లేటెస్ట్ గా మ్యూజిక్‌ సిట్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అదిరిపోయే మ్యూజిక్‌ ఇవ్వబోతున్నారట ఎంఎం కీరవాణి. బీజీఎంతో అదరగొట్టబోతున్నారని సమాచారం.

67

ఇక ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఉందట. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, అందులో శృతి హాసన్‌ నర్తిస్తుందని సమాచారం. చిరంజీవితో ఆమె మరో సారి లెగ్‌ షేక్‌ చేయబోతుందట. అయితే ఈ పాట చిత్రీకరణ కూడా పూర్తయ్యిందని తెలుస్తుంది. అదిరిపోయే మాస్‌ సాంగ్‌ అని, థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో శృతి హాసన్ లక్ చిరుకి కలిసి వస్తుందా అనేది చూడాలి. 

77

ఇదిలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్‌.. అడవి శేష్‌ తో కలిసి `డెకాయిట్‌ః ఏ లవ్‌ స్టోరీ` సినిమాలో నటిస్తుంది. అలాగే `సలార్ 2`లోనూ ఆమెనే హీరోయిన్‌. ఇది వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దీంతోపాటు రజనీకాంత్‌తో `కూలీ` మూవీ చేస్తుంది. `చెన్నై స్టోరీ` అనే మరో తమిళ మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తుంది శృతి హాసన్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved