- Home
- Entertainment
- తండ్రి వయసున్న హీరోలు చిరు, బాలయ్యలతో నటించడంపై ట్రోల్స్.. శృతి హాసన్ రియాక్షన్ వింటే నోరెళ్ల బెట్టాల్సిందే!
తండ్రి వయసున్న హీరోలు చిరు, బాలయ్యలతో నటించడంపై ట్రోల్స్.. శృతి హాసన్ రియాక్షన్ వింటే నోరెళ్ల బెట్టాల్సిందే!
శృతి తన తండ్రి కమల్ హాసన్ ఏజ్ ఉన్న చిరంజీవి, బాలయ్యలతో కలిసి నటించింది. డ్యూయెట్లు పాడింది. వెండితెరపై రచ్చ రచ్చ చేసింది. అయితే ఈ విషయంలో శృతి హాసన్ కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.

శృతి హాసన్ ఇటీవల చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` సినిమాలు చేసింది. ఈ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఇందులో శృతి తన తండ్రి కమల్ హాసన్ ఏజ్ ఉన్న చిరంజీవి, బాలయ్యలతో కలిసి నటించింది. డ్యూయెట్లు పాడింది. వెండితెరపై రచ్చ రచ్చ చేసింది. అయితే ఈ విషయంలో శృతి హాసన్ కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. తండ్రి ఏజ్ ఉన్న హీరోలతో చేయడం పట్ల ట్రోల్స్ కి గురయ్యింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై శృతి హాసన్ స్పందించింది. ఏజ్ డిఫరెన్స్ పై ఆమె స్పందన షాకిచ్చేలా ఉండటం విశేషం. ఇంతకి శృతి ఏం చెప్పిందంటే, ఏజ్ డిఫరెన్స్ కి సంబంధించి తనపై వచ్చే విమర్శలు తనకు ఎలాంటి ఇబ్బంది కలిగించవని స్పష్టం చేసింది. ఎందుకంటే ఆయా సినిమాలను చాలా మంది ఆడియెన్స్ మెచ్చుకున్నారు. ఆదరించి పెద్ద హిట్లు చేశారు. ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు ఎంతగానో ఎంకరేజ్ చేశారు.
అయినా నటుడికి ఈ వయసు, నటికి ఈ ఏజ్, ఆ హీరోల పక్కన ఆమె సరిగ్గా సరిపోయిందని ఇప్పటి వరకూ ఎవరూ అనలేదు. అందరూ నన్నింకా చిన్న పిల్లగానే చూస్తున్నారు. దానికి నేను ఆనందిస్తున్నా, జోక్స్ అన్నింటినీ పక్కన పెడితే, ఆ పాత్ర చిత్రీకరణ నాకెంతో నచ్చింది. అలాగే ఇద్దరు లెజెండరీ నటులతో నటించే అవకాశం వచ్చింది. అలాంటప్పుడు నేనెందుకు ఆ సినిమాలకు నో చెప్పాలి.
మరో విషయం ఏంటంటే, ఈ విమర్శలు నాకు వ్యక్తిగతంగా ఎదురైనవి కాదు, నా రోల్‌ని అలా రాసినందుకు డైరెక్టర్ మమ్మల్ని ఎంచుకున్న విధానంపైనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తరచూ మాట్లాడుకునే బాలీవుడ్‌లోనూ వయసు వ్యత్యాసం ఉంటుందని చెప్పింది శృతి హాసన్. ప్రేమ విషయం చెబుతూ, తాను గొప్ప ప్రేమని పొందానని చెప్పింది. అందుకెంతో గర్వంగా ఉందన్నారు.
శృతి హాసన్ తెలుగులో వరుస విజయాలు అందుకుంది. తెలుగు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె లక్కీ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ సంక్రాంతికి `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో విజయాలు అందుకుంది. ఇప్పుడు `సలార్`తో రాబోతుంది. ప్రభాస్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకుడు.