- Home
- Entertainment
- ‘ఎన్టీఆర్ 30’ స్టోరీ రామ్ చరణ్ చేయాల్సిందా.. ఎప్పటి నుంచో చెర్రీ కోసం ప్రయత్నిస్తున్న కొరటాల శివ!
‘ఎన్టీఆర్ 30’ స్టోరీ రామ్ చరణ్ చేయాల్సిందా.. ఎప్పటి నుంచో చెర్రీ కోసం ప్రయత్నిస్తున్న కొరటాల శివ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్30’. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీపై తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ వైరల్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజీ’ చిత్రం తర్వాత ప్రస్తుతం మరోక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ఈ కాంబినేషన్ లో ఊహించని విధంగా మరోసారి సినిమా సెట్ కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. NRT30 వర్క్ టైటిల్ పేరుతో పనులు జరుగుతున్నాయి. చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది.
‘ఆచార్య’తో డిజపాయింట్ చేసిన కొరటాల శివ (Koratala Siva) ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటించడంతో అభిమానులు కాస్తా ఆందోళన చెందారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దాదాపు ఆరునెలలు దాటిపోయినా చిత్రంపై ఎలాంటి మూమెంట్ లేకపోవడంతో సినిమా కూడా ఆగిపోయిందనే టాక్ కూడా వచ్చింది.
రీసెంట్ గా ఆ రూమార్లకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ సాలిడ్ అప్డేట్ అందించింది. ‘ఎన్టీఆఱ్ 30’ ఆగిపోలేదని తెలిపింది. ప్రీ ప్రొడక్షన్ పనులు చకా చకా కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ - కొరటాల చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందనే ఆశలు చిగురించాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా నయా లుక్స్ తో అదరగొడుతున్నాడు.
ఇదిలా ఉంటే ‘ఎన్టీఆర్30’పై మరో క్రేజీ న్యూస్ నెట్టింట సర్యూలేట్ అవుతోంది. అసలు ఈ చిత్రం రామ్ చరణ్ (Ram Charan) చేయాల్సింది అంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఎప్పటి నుంచో కొరటాల శివ చెర్రీ కోసం ఎదురుచూస్తున్నారంట.
‘మిర్చి’ తర్వాత చరణ్ తోనే సినిమా చేయాల్సి ఉందని అంటున్నారు. అప్పటి వరుస చరణ్ కు కథలు చెబుతున్నా వర్కౌట్ కాలేదంటున్నారు. ఈ క్రమంలోనే ‘ఎన్టీఆర్ 30’కి సంబంధించిన స్టోరీ కూడా చరణ్ వరకు వెళ్లి రిజెక్ట్ అయ్యిందని అంటున్నారు. తారక్ ఓకే చేయడంతో మళ్లీ పట్టాలెక్కిందని తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ సమయంలో చరణ్ తదుపరి చిత్రం కొరటాలతోనే చేయాల్సి ఉన్నా.. కుదరలేదంట. చేసేదేమీ లేక కొరటాల చిరంజీవితో ‘ఆచార్య’ను తెరకెక్కించారు. శివను ఇబ్బంది పెట్టలేకే ‘ఆచార్య’లో కొరటాల దర్శకత్వంలో చరణ్ గెస్ట్ అపియరెన్స్ వరకు నటించి సరిపెట్టారని తెలుస్తోంది. ఏదేమైనా చరణ్ రిజెక్ట్ చేసిన చిత్రాన్ని తారక్ ఓకే చేయడంతో మరింత ఆసక్తినెలకొంది. చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్నట్టు తెలుస్తోంది.