డైరెక్టర్ ని బాలయ్య బెదిరిస్తున్నారా, సింక్ కుదరట్లేదా.. ఎన్బీకే 109పై షాకింగ్ రూమర్స్
బాలకృష్ణ 109వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య నటించే తదుపరి చిత్రంపై అంచనాలు తప్పకుండా పీక్స్ కి వెళతాయి. అలాంటి బాలయ్యతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తోడైతే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.
అదే ఊపులో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.బాలకృష్ణ 109వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ చిత్రం గురించి ఒక షాకింగ్ రూమర్ నందమూరి ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. అదేంటంటే బాలయ్యకి, బాబీకి మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబీకి, బాలయ్యకి మధ్య సింక్ కుదరట్లేదట.
బాబీ వర్కింగ్ స్టైల్ పట్ల బాలయ్య అసంతృప్తితో ఉన్నట్లు రూమర్స్ జోరుగా వైరల్ అవుతున్నాయి. ఒక సందర్భంలో బాలయ్య షూటింగ్ ఆపేస్తానని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించింది.
అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని షూటింగ్ చాలా అద్భుతంగా కొసాగుతోందని క్లారిటీ ఇచ్చారు. చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ చిత్రంలో చాలా మంది హీరోయిన్స్ బాలయ్యకి జోడిగా నటించబోతున్నారు వారిలో ఊర్వశి రౌటేలా ముందుగా ఫైనల్ అయింది. బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.