- Home
- Entertainment
- Allu Arjun: పుష్ప 2లో బాలీవుడ్ ప్రమేయం.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.90 కోట్లా ?
Allu Arjun: పుష్ప 2లో బాలీవుడ్ ప్రమేయం.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.90 కోట్లా ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ రోజు రోజుకి ఎల్లలు దాటుతోంది. సెలెబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు.. దేశవిదేశాల్లోని సినీ లవర్స్ అంతా పుష్ప చిత్రంలోని డైలాగులు, అల్లు అర్జున్ యాటిట్యూడ్ ని అనుకరిస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ రోజు రోజుకి ఎల్లలు దాటుతోంది. సెలెబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు.. దేశవిదేశాల్లోని సినీ లవర్స్ అంతా పుష్ప చిత్రంలోని డైలాగులు, అల్లు అర్జున్ యాటిట్యూడ్ ని అనుకరిస్తున్నారు. అంతలా పుష్ప మొదటి భాగం క్రేజ్ వ్యాపించింది.
పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2పై ఇప్పుడు అంచనాలు మాములుగా లేవు. దీనితో పుష్ప 2లో కథ యూవర్సల్ అప్పీల్ ఉండేలా.. మొదటి భాగంకి సరైన కొనసాగింపు ఉండేలా సుకుమార్ చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఆగష్టు నుంచి పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనితో పుష్ప 2 కి డీల్ కుదుర్చుకునేందుకు పలు బాలీవుడ్ సంస్థలు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
దీనితో సహజంగానే పుష్ప 2 బడ్జెట్ కూడా పెరుగుతున్నట్లు టాక్. అల్లు అర్జున్ కి ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. దీనితో పార్ట్ 2కి బన్నీ ఏకంగా రూ 90 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే బిజినెస్ లో వాటా కూడా అడుగుతున్నాడట. ఓవరాల్ గా బన్నీకి పుష్ప 2 నుంచి రూ 100 కోట్ల వరకు ముట్టనుంది అని అంటున్నారు.
ఇక తొలి భాగానికి సుకుమార్ 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. పార్ట్ 2కి ఆయన దాదాపు 45 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రూ 140 కోట్ల వరకు హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్ కే పోతోంది. ఇతర నటీనటుల రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి మరో 200 కోట్లు అవుతుంది. ఓవరాల్ గా పుష్ప 2 బడ్జెట్ ని నిర్మాతలు రూ 350 కోట్లు గా లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ రేంజ్ బడ్జెట్ తో సుకుమార్ ఎలాంటి అవుట్ పుట్ రాబడుతాడో ఊహించుకుంటుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ స్టైల్, రఫ్ లుక్, మ్యానరిజమ్స్ నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. క్రికెటర్లు, సామాన్య ప్రజలు, సినీ తారలు చాలా మంది పుష్ప స్టైల్ ని అనుకరించడం చూశాం.