MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • చిరంజీవి జననానికి, సినిమా కెరీర్‌కి గిన్నిస్‌ వరల్డ్ రికార్డుకి షాకింగ్‌ లింక్‌, ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే!

చిరంజీవి జననానికి, సినిమా కెరీర్‌కి గిన్నిస్‌ వరల్డ్ రికార్డుకి షాకింగ్‌ లింక్‌, ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే!

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల గిన్సిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ అరుదైన రికార్డుకి, ఆయన జననానికి, సినిమా కెరీర్‌కి సంబంధం ఉండటం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 27 2024, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డు వరించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ సినిమాలో మోస్ట్ ప్రొలిఫిక్‌ యాక్టర్‌గా, డాన్సర్‌గా ఆయన ఈ రికార్డు సృష్టించారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24000 డాన్స్ మూమెంట్స్ కి గానూ ఈ గిన్నిస్‌ వరల్డ్ రికార్డు వరించడం విశేషం. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన నటుడు మరెవ్వరూ లేరని చెప్పొచ్చు. దీంతో మెగాస్టార్ పేరుతో మరో రికార్డు నమోదు అయ్యింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Chiraneevi

Chiraneevi

చిరంజీవికి గిన్నిస్‌ రికార్డు రావడానికి, ఆయన జననానికి, సినిమా కెరీర్‌కి ఒక సంబంధం ఉంది. మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా భావించే అంశాలున్నాయి. మరి ఆ అంశాలేంటి? గిన్నిస్‌ వరల్డ్ రికార్డుకి, చిరంజీవికి ఉన్న సంబంధం ఏంటనేది చూస్తే, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుని 1955లో స్థాపించారు. ఆగస్ట్ లోనే దాన్ని లాంచ్‌ చేశారు. సరిగ్గా అదే ఏడాది ఆగస్ట్ లోనే చిరంజీవి జన్మించారు. కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా చిరంజీవి 1955 ఆగస్ట్ 22న జన్మించిన విషయం తెలిసిందే. 
 

34

అంతేకాదు మరో షాకింగ్ లింక్‌ ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తొలి చిత్రం `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్‌ 22న విడుదలైంది. అంటే చిరంజీవి వెండితెరకి పరిచయమైన రోజు అది. సరిగ్గా అదే రోజు అంటే సెప్టెంబర్‌ 22(2024) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డు ఆయన్ని వరించింది. ఇలా ఈ రెండు రకాలుగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మక రికార్డు దక్కడం యాదృశ్చికమైనా, చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పొచ్చు. అంతేకాదు ఇదే ఏడాది ఇటీవల ఆయనకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ కూడా వరించిన విషయం తెలిసిందే. ఇక ఆయనకు దక్కని అవార్డులంటూ లేవని చెప్పొచ్చు. 

44

చిరంజీవికి ఇప్పటికే పద్మ విభూషణ్‌తోపాటు పద్మ భూషణ్‌ పురస్కారాలు వరించాయి. అలాగే ఈఫీలో ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది. రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. 9 ఫిల్మ్ ఫేర్‌అవార్డులు, నాలుగు నంది పురస్కారాలు దక్కాయి. ఆంధ్రయూనివర్సిటీ డాక్టరేట్‌తోనూ గౌరవించింది. ఇలాంటి అరుదైన రికార్డులు ఆయన చెంత చేరాయి. కానీ జాతీయ అవార్డులు రాలేదు. ఆయన నటించిన చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్‌. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సోషియా ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image2
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image3
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved