- Home
- Entertainment
- Nagababu: మెగా బ్రదర్ నాగబాబుకు జబర్దస్త్ లో అంత అవమానం జరిగిందా?... రోజా కంటే తక్కువ చేసి!
Nagababu: మెగా బ్రదర్ నాగబాబుకు జబర్దస్త్ లో అంత అవమానం జరిగిందా?... రోజా కంటే తక్కువ చేసి!
జబర్దస్త్ షో అంటే గుర్తొచ్చే పేర్లలో నాగబాబు ఒకరు. నటుడిగా నిర్మాతగా ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్నా రాని గుర్తింపు ఆయనకు జబర్దస్త్ తెచ్చింది. జబర్దస్త్ జడ్జిగా, నవ్వుల బాబుగా ఫేమస్ అయ్యారు. అయితే ఓ విషయంలో ఆయనకు అవమానం జరిగినట్లు తెలుస్తుంది. రోజా కంటే ఆయన్ని తక్కువ చేసి చూశారనిపిస్తుంది.

jabardasth show
జబర్దస్త్(Jabardasth) షోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ రీత్యా టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్, జడ్జెస్ రెమ్యూనరేషన్ ఎంత? ఎపిసోడ్ కి వారు ఎంత సంపాదిస్తారనే ఆసక్తి ఎప్పటి నుండో ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ జడ్జెస్ గా ఏళ్ల తరబడి చేసిన రోజా, నాగబాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకోవాలని అనేక మంది అనుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది.
jabardasth show
జబర్దస్త్ షో ప్రారంభంలో మేనేజర్ గా చేసిన ఏడుకొండలు ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొనడంతో పాటు ఎవరికీ తెలియని కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిని ఖండించేందుకు ఏడుకొండలు కోరి మరీ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్యూలో పాల్గొన్నారు. కిరాక్ ఆర్పీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు.
jabardasth show
మొదట్లో రోలింగ్ రఘు, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, టిల్లు వేణు, రాకెట్ రాఘవలతో జబర్దస్త్ షో ప్రారంభమైంది. వాళ్లకు ఎపిసోడ్ కి ఇంత ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం. ఆ అమౌంట్ వాళ్లకు నచ్చి జబర్దస్త్ లో స్కిట్స్ చేయడం ప్రారంభించారు. అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచాలి అన్నారు. కుదరదని చెప్పడం జరిగింది, అన్నారు.
jabardasth show
వాళ్ళ టీమ్స్ లో చేస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులను ఓంకార్ వేరే ఛానల్ కి తీసుకెళ్లాలని చూశారు. ఈ విషయం తెలిసి నేను వాళ్లతో మాట్లాడాను. 13 ఎపిసోడ్స్ తర్వాత మీకు టీం లీడర్స్ గా అవకాశం ఇస్తాను, వెళ్ళొద్దని చెప్పాను. అలా నన్ను నమ్మి జబర్దస్త్ లో వాళ్ళు కొనసాగారు. తర్వాత మంచి పాపులారిటీ తెచ్చుకున్నారని ఏడుకొండలు తెలియజేశారు.
jabardasth show
ఇక జబర్దస్త్ జడ్జెస్ గా రోజా, నాగబాబు(Nagababu) ప్రారంభం నుండి ఉన్నారు. 2019లో నాగబాబు, ఇటీవల రోజా షోని వీడడం జరిగింది. కాగా రోజా కంటే నాగబాబు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారని అందరూ భావించారు. అది నిజం కాదని మాజీ మేనేజర్ ఏడుకొండలు వెల్లడించారు.
jabardasth show
రోజా(Roja) ఒకప్పుడు స్టార్ హీరోయిన్, నాగబాబు మాత్రం కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ కారణంగా రోజాకు నాగబాబు కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాము. ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ విషయాలు వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాము. వాళ్ళ ఇమేజ్ ఆధారంగా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు ఏడుకొండలు వివరించారు.
అప్పటి ఆర్ధిక పరిస్థితుల రీత్యా నాగబాబు కాదనలేకపోయారు. తన తోటి జడ్జి కంటే తక్కువ ఇస్తున్నారనే అసహనం మాత్రం ఆయనలో గూడు కట్టుకొని ఉంది. కొడుకు వరుణ్ హీరోగా ఎదిగాక, ఆర్ధికంగా నిలదొక్కుకున్నాక నాగబాబు జబర్దస్త్ పై ఆరోపణలు చేసి బయటికి వచ్చేశారు. 2010లో విడుదలైన ఆరెంజ్ మూవీ నిర్మాతగా ఉన్న నాగబాబు పూర్తిగా మునిగిపోయాడు.